Kajal Aggarwal: కెరీర్ సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడు స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకున్నారంటే చాలు.. వాళ్ల సినీ కెరీర్ పై అటు ఇండస్ట్రీలో, ఇటు అభిమానులలో లేనిపోని అనుమానాలు రేకెత్తుతుంటాయి. చేతినిండా సినిమాలున్న టైంలో పెళ్లి చేసుకుంది.. ఇకముందు సినిమాలు చేస్తుందా లేదా? అనుకుంటారు. అయితే.. పెళ్ళైనా సినిమాలు చేస్తున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. కానీ.. పిల్లలు పుట్టాక సినిమాలు చేస్తారా లేదా? అనేది అసలు సందేహం. ప్రస్తుతం దక్షిణాది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కెరీర్ గురించి ఇలాంటి అనుమానాలే ఇండస్ట్రీలో ఆసక్తి కలిగిస్తున్నాయి. అయితే.. కాజల్ గురించి ఈ అనుమానాలు రావడానికి కారణాలు లేకపోలేదు. కాజల్ మొన్నటివరకూ ప్రెగ్నన్సీ కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఓ బిడ్డకు తల్లి. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారి గౌతమ్ కిచ్లుని పెళ్లాడిన కాజల్.. ఇటీవలే పండంటి మగబిడ్డ(నీల్)కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో దాదాపు అందరూ స్టార్స్ తో సినిమాలు చేసిన కాజల్.. పెళ్లయ్యాక సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తోంది. ఈ క్రమంలో కాజల్ ఇకపై సినిమాలు చేస్తుందా లేదా? అనుకుంటున్న సమయంలో కాజల్ రీఎంట్రీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మొన్నటివరకూ కాజల్ మెల్లగా తన బిడ్డ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని సినిమాలకు దూరం కాబోతుందని.. ఆమె భర్త గౌతమ్ కూడా కాజల్ నిర్ణయాన్ని సమర్థించాడని టాక్ వచ్చింది. ఇదివరకు కాజల్ చెల్లి నిషా కూడా పెళ్లి తర్వాత సినిమాలు చేయలేదు. మరి అక్క కాజల్ కూడా చెల్లి బాటలోనే వెళ్తుందేమో అనుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ.. తాజా సమాచారం ప్రకారం.. కాజల్ వచ్చే ఏడాది సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వనుందట. అదికూడా గ్లామరస్ రోల్స్ కాకుండా కేవలం నటనకు ప్రాధాన్యమున్న, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ఓకే చెప్పనున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి కాజల్ నటనకంటే గ్లామర్ కే ఫ్యాన్ బేస్ ఎక్కువ. మరి అధికారికంగా కాజల్ ఏం చెబుతుందో చూడాలి. ఇక కాజల్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)