స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన కుమారుడికి నీల్ కిచ్లు అని నామకరణం కూడా చేసింది. అయితే.. కొడుకు పుట్టకముందు వరకు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉన్న కాజల్.. ఆ తర్వాత పెద్దగా పోస్టులు కూడా పెట్టలేదు. సౌత్ ఇండియన్ గ్లామర్ బ్యూటీలలో కాజల్ ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది.
ఈ క్రమంలో పెళ్లి తర్వాత ఓ గ్లామరస్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సర్ప్రైజ్ చేసింది. ఈ ఫొటోలో కాజల్ ఎల్లో, గ్రీన్ కలర్స్ మేళవించిన డ్రెస్ ని ధరించింది. అలాగే కాస్త ఘాటుగా పోజు పెడుతూ.. థైస్ షో చేసి హొయలు పోయిన ఫోటో ప్రస్తుతం నెట్టింట సెగలు పుట్టిస్తోంది. అందరూ కాజల్ నుండి నీల్ తో దిగిన పిక్స్ ఎక్సపెక్ట్ చేశారు. కానీ ఇలా గ్లామర్ ట్రీట్ ఇచ్చేసరికి సర్ప్రైజ్ అవుతున్నారు.
ఇక ఇండస్ట్రీలో కాజల్ అందాలకు క్రేజ్ పీక్స్ లో ఉంటుంది. ఎప్పుడెప్పుడు కొత్త పోస్ట్ పెడుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. అందులోనూ ఈ మధ్య కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపై కాజల్ పూర్తి సమయాన్ని ఫ్యామిలీకే కేటాయించనుందా లేక మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వనుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కాజల్ చేతిలో అయినా ఏ సినిమాలు లేవని తెలుస్తుంది. మరి కాజల్ లేటెస్ట్ ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.