టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గర్భవతి అనే విషయం తెలిసిందే. కొత్త ఏడాది ప్రారంభంలో ఈ గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు కాజల్ దంపతులు. ఆ ప్రకటన తర్వాత కాజల్ అగర్వాల్ బేబీ బంప్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అవన్ని వాస్తవమో కాదో తెలియదు. కాగా తాజాగా కాజల్ అగర్వాల్ తన ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. దీనిలో చందమామ బేబీ బంప్ క్లియర్ గా కనిపిప్తోంది. కాజల్ కూడా చాలా మారిపోయింది. కాస్త బొద్దుగా తయారయ్యింది.
ఇది కూడా చదవండి : కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్.. ఫోటో షేర్ చేసిన భర్త
ఓరియో డబుల్ స్టఫ్ లిక్ రేస్ బిస్కెట్ యాడ్ వీడియోలో కాజల్, తన సోదరి కుమారుడు ఇషాన్ తో కలిసి నటించింది. ఈ వీడియోలో కాజల్, ఇషాన్ ఇద్దరు కలిసి వీడియో గేమ్ ఆడుతుంటారు. ఆ తర్వాత ఓరియో బిస్కట్స్ ని తింటారు. ఈ యాడ్ కన్నా కూడా.. ఇందులో కాజల్ బేబీ బంప్ తో కనిపించడం నెటిజనులను విపరీతంగా ఆకర్షిస్తోంది. బేబీ బంప్ తో, కాస్త బొద్దుగా ఉన్న కాజల్.. చూడ్డానికి చాలా బావుంది అని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ప్రసుత్తం ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపలో తెలియజేయండి.