జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంతో ట్రాఫిక్ పోలీసుల్లో కదలిక వచ్చింది. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనం జనాలపైకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ వాడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జడ్‌ప్లస్ కేటగిరి ఉన్న వారు తప్ప ఇతరులు ఎవరూ వాహనాలపై బ్లాక్ ఫిల్మ్ ఉపయోగించవద్దని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ వాడకూడదని తెలిపారు. వాహనాలపై అనుమతి లేకుండా బ్లాక్ ఫిల్మ్ పెట్టకూడదన్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వాహనాలకు బ్లాక్ ఫిల్మ్, పోలీస్, ప్రెస్, ఆర్మీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర స్టిక్కర్ల దుర్వినియోగంపై తనిఖీలు చేస్తున్నారు. రెండు వారాల పాటు ట్రాఫిక్ పోలీసులు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఖైరతాబాద్ పరిధిలోని ఇందిరాగాంధీ చౌరస్తా, ఫిలింనగర్ కూడలి, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సహా చాలా ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టారు.జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద కూడా తనిఖీలు జరిగాయి. బ్లాక్ ఫిల్ములు, స్టిక్కర్ల వాహనాలను గుర్తించి వాటిని తొలగించారు. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్‌కు చెందిన కారుకు బ్లాక్ ఫిల్మును పోలీసులు గుర్తించారు. ఆ కారును ఆపి బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించారు. ఆ సమయంలో కారులో ఎన్టీఆర్ లేరు. డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. డ్రైవరుతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు, మరో వ్యక్తి ఉన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న వారు స్పష్టంగా కనిపించాల్సిందేనని, బ్లాక్ ఫిల్మ్ కోటింగ్ ఉన్న అద్దాలు అమర్చడం నిబంధనలకు విరుద్ధం అనే సంగతి తెలిసిందే.
#HYDTPinfo
Today, West Central Zone Tr. Police conducted SPL. drive against the tinted glass, improper No. plates & stickers (MLA, Police, Press) of vehicles, which are under against CMV Rules, 1989 & imposed challans against the violating vehicles.@JtCPTrfHyd pic.twitter.com/cIGDKmTtqV— Hyderabad Traffic Police (@HYDTP) March 19, 2022
మొత్తం 90 వాహనాలకు బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించి కొంత మందికి జరిమానాలు విధించినట్లు సైఫాబాద్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాంచందర్, జూబ్లీహిల్స్ సీఐ ముత్తు తెలిపారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్, ఎంఐఎం ఎమ్మెల్యే మేరాజ్ హుస్సేన్, ఆంధ్రప్రదేశ్‌లో పుట్టపర్తి ఎమ్మెల్యే దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్ ఉన్న వాహనాలను ట్రాఫిక్ పోలీసులు గుర్తించి స్టిక్కర్లను తొలగించారు. నంబరు ప్లేటు సరిగా లేని వాహనాలకు చలానాలు వేశారు.
#HYDTPinfo
Today, @HYDTP officers conducted SPL. drive against the tinted glass, improper No. plates & stickers (MLA, Police, Press) of vehicles, which are under against CMV Rules, 1989 & imposed challans against the violating vehicles.@JtCPTrfHyd pic.twitter.com/mFSkgE7T88— Hyderabad Traffic Police (@HYDTP) March 20, 2022