Jr NTR: సినీ ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీల గురించి ఏ విషయమైనా తెలుసుకోవాలనే ఆసక్తి సినిమా లవర్స్ అందరిలో ఉంటుంది. అందులోనూ స్టార్ హీరోలు, వారి ఫ్యామిలీ విషయాలు, స్పెషల్ ఫోటోల గురించి తెలుసుకున్నప్పుడు ఫ్యాన్స్ లో కనిపించే ఆనందం వేరే లెవెల్ లో ఉంటుందనే చెప్పాలి. ఇటీవలే ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తదుపరి సినిమా కొరటాల శివతో చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో అడపాదడపా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లినట్లు తెలుస్తుంది. అక్కడ తన సతీమణి లక్ష్మీప్రణతితో కలిసి సరదాగా మాట్లాడుకుంటున్న ఫోటో ఒకటి షేర్ చేశాడు. ఆ ఫొటోలో ఎన్టీఆర్, ప్రణతి ఇద్దరు కూడా చాలా ఆనందంగా నవ్వుకుంటూ, కాఫీ తాగుతూ ముచ్చటించడం మనం చూడవచ్చు. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ కి సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ స్పెషల్ సెలబ్రేషన్స్ ఉన్నా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తుంటాడు. మరి ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎంతో గౌరవిస్తారు, అభిమానిస్తారు. ఇక కొరటాల శివ సినిమా తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. మరి ఎన్టీఆర్ లేటెస్ట్ ఫ్యామిలీ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr)