టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల హనుమాన్ దీక్ష చేపట్టి మాల ధరించిన సంగతి తెలిసిందే. దాదాపు 21 రోజుల అనంతరం ఎన్టీఆర్.. హనుమాన్ దీక్షను విరమించినట్లు తెలుస్తుంది. తాజాగా ఎన్టీఆర్ దీక్షను పూర్తిచేసినట్లు తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. సాధారణంగా ఎన్టీఆర్ ఇదివరకు దైవ మాల ధరించిన దాఖలాలు లేవు. కానీ ఇటీవల హనుమాన్ మాల ధరించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ హనుమాన్ మాలలో ఉండగా.. పక్కనే పంతులుతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఎన్టీఆర్ తన స్వగృహంలోనే హనుమాన్ దీక్షను చివరి పూజతో పూర్తి చేసినట్లు సమాచారం. హనుమాన్ దీక్షలో 21 రోజులపాటు తెల్లవారుజాము 4 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు పూజలు జరిగినట్లు తెలుస్తుంది.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే దర్శకధీరుడు రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేశాడు. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకొని పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తదుపరి సినిమా దర్శకుడు కొరటాల శివతో చేయనున్నాడు. అలాగే ఎన్టీఆర్ లైనప్ లో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నాడు. త్వరలోనే కొరటాల శివతో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఎన్టీఆర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
. @tarak9999‘s 21 Days Deksha will be Completed by May 04. pic.twitter.com/gtwqmJk3Pr
— 𝐍𝐓𝐑 𝐓𝐡𝐞 𝐒𝐭𝐚𝐥𝐰𝐚𝐫𝐭 (@NTRTheStalwart) April 25, 2022