నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ సోషియో ఫాంటసీ చిత్రం "బింబిసార". ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తెరకెక్కించాడు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించారు. ఎన్నో అంచనాల మధ్య బింబిసార మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. ఈక్రమంలో పలువురు సినీ ప్రముఖులు బింబిసార మూవీ టీమ్ కి అభినందనలు తెలిపారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా "బింబిసార" మూవీపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సినిమా అద్భుతంగా, ఎంతో ఆసక్తిగా ఉందంటూ కితాబ్ ఇచ్చారు. బింబిసార మూవీ టీమ్ కి అభినందనలు తెలిపారు. ఈ శుక్రవారం విడుదలైన బింబిసార మూవీ చూసిన వాళ్లు.. తమ అభిప్రాయాన్ని ట్విట్టర్లో తెలియజేస్తున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. కళ్యాణ్ తన నట విశ్వరూపంతో ఆకట్టుకున్నారని కొనియాడుతున్నారు. కళ్యాణ్ రామ్ కు మరో హిట్ సినిమాగా బింబిసార కానుందని కొందరు ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సైతం ఓ సామాన్య ప్రేక్షకుడిలాగా బింబిసార మూవీపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. " బింబిసార గురించి మంచి టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. మొదటిసారి చూస్తున్నప్పుడు మనం అనుభవించిన ఉత్సాహంతో ప్రజలు సినిమాను ఆస్వాదించినప్పుడు మంచి అనుభూతి కలుగుతుంది. Hearing great things about #Bimbisara. It feels good when people enjoy a film with the sort of enthusiasm we felt while watching it for the first time. — Jr NTR (@tarak9999) August 5, 2022 అన్నా.. నువ్వు బింబిసార రాజు భర్తీ చేశావు. ఈ సినిమాను విజయవంతం చేసిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులందరికీ వందనాలు. ఈ సినిమాను డైరెక్టర్ వశిష్ఠ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు కీరవాణిగారు బ్యాక్ బోన్" అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. బింబిసార మూవీ టీమ్ పై ఎన్టీఆర్ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. .@NANDAMURIKALYAN anna you are irreplaceable as King Bimbisara. @DirVassishta handled the film like a pro. The legendary @mmkeeravaani garu is the backbone of #Bimbisara. Shoutout to all the actors and technicians who made this a success. — Jr NTR (@tarak9999) August 5, 2022 ఇదీ చదవండి: సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఘాటుగా స్పందించిన సమీరా రెడ్డి! ఇదీ చదవండి: కొడుకుతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు!