Ram Charan: ఓ అభిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై ఉన్న ఎనలేని అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తన వరి పొలంలోని పంటను రామ్ చరణ్ రూపంలో మలిచాడు. దాన్ని ఫొటో తీసి చరణ్‌కు బహుమతిగా ఇచ్చాడు. గద్వాల జిల్లా గోర్లఖాన్‌కు చెందిన జయరాజ్‌కు రామ్ చరణ్ అంటే పిచ్చి. ఆయనపై వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకోవాలనుకున్నాడు. ఇందుకోసం తన పొలంలో వరి నారును రామ్ చరణ్ ఆకారంలో నాటాడు. దాన్ని ఫొటో తీసి ఫ్రేమ్ చేయించాడు. ఇక తన సొంత ఊరినుంచి రామ్ చరణ్ ఉంటున్న హైదరాబాద్‌లోని ఇంటికి పయనమయ్యాడు. దాదాపు 264 కిలోమీటర్లు నడిచాడు.
ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ జయరాజ్ తనను కలుసుకునే అవకాశం కల్పించాడు. జయరాజ్, రామ్ చరణ్‌ను కలిశాడు. పంటను చరణ్ రూపంలో మలిచిన ఫొటో ఫ్రేమ్‌ను కానుకగా ఇచ్చాడు. దాని గురించి ఆయనకు వివరించి చెప్పాడు. అనంతరం తన పొలంలో పండించిన రెండు బస్తాల ధాన్యాన్ని కూడా కానుకగా ఇచ్చాడు. జయరాజ్ అభిమానం చూసి చరణ్ సంతోషించాడు. అతడ్ని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. రెండు,మూడు ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, చరణ్ ప్రస్తుతం ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఆర్‌సీ 15 చేస్తున్నాడు. శంకర్ తెలుగులో దర్శకత్వం వహిస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. రాజకీయ నేపథ్యంలో సినిమా ఉండనుంది. చరణ్ ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’పై దిల్ రాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 170 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మరి, చరణ్‌కు అభిమాని కానుకపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
An ardent fan named Jairaj creates an artistic portrait of #RamCharan with rice crops in his paddy field in Gorlakhan Doddi, Gadwal. 🙏
He walked 264 KMs to meet Our @AlwaysRamCharan and explain about his artefact.👌😍#ManOfMassesRamCharan pic.twitter.com/CKXNyYkB5g
— SumanTV (@SumanTvOfficial) May 28, 2022
An ardent fan named Jairaj creates an artistic portrait of #RamCharan with rice crops in his paddy field in Gorlakhan Doddi, Gadwal.
He walked 264 KMs to meet @AlwaysRamCharan and explain about his artefact. pic.twitter.com/wDdDxXBUif
— SumanTV (@SumanTvOfficial) May 28, 2022