గీతూ రాయల్.. బుల్లితెర ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన పని లేదు. చిత్తూరు యాసతో గలాగలా మాట్లాడే ఈ అమ్మడుకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. టిక్ టాక్ వీడియోలు, బిగ్ బాస్ రివ్యూలతో మంచి ఫేమ్ సంపాదించింది. ఆ తర్వాత జబర్దస్త్ లో తన చిత్తూరు యాస పంచులతో ఫ్యాన్ బేస్ ను పెంచేసుకుంది. హైపర్ ఆది చేసిన పుష్ప స్పూఫ్ లో శ్రీవల్లిగా.. ఆదినే డామినేట్ చేసేసింది. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ సంఘటనను కూడా బయటపెట్టింది.
గీతూ రాయల్ కు అల్లు అర్జున్ అంటే అమితమైన అభిమానం అంట.. బన్నీ కోసం కోసుకుంటా అంటూ తన అభిమానాన్ని వెల్లడించింది. అంతేకాకుండా తనకు మాట్లాడటం అంటే చాలా ఇష్టమని అందుకే ఆర్జే కావాలనుకున్నట్లు చెప్పుకొచ్చింది. పెద్దపెద్ద బ్యానర్లలో తనకు సినిమా చేసే అవకాశం వచ్చినా కూడా యాక్టింగ్ రాదని అవకాశాలను వదులుకున్నట్లు తెలిపింది.
కాస్టింగ్ కౌచ్ విషయానికి వస్తే.. ‘ఇటీవలే నాకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాలో ఓ ఈవెంట్ ఉంది హోస్టింగ్ చేస్తారా అని అడిగారు. నాకు హోస్ట్ చేయడం ఇష్టమని సరే అన్నాను. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో షాపింగ్ కూడా చేయచ్చు అనుకున్నాను. మంచి రెమ్యూనరేషన్ అడిగాను అందుకు ఈవెంట్ వాళ్లు సరే అన్నారు. చివరికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసే సమయంలో మేనేజర్ పీఏ నాకు కాల్ చేశాడు.’
‘ఫోన్ చేసి పర్సనల్ గా మీకు ఓకే కదా అన్నాడు. నా పనుల కోసం ఎవరన్నా అసిస్టెంట్ గా వస్తారనుకుని సరే అన్నాను. అతను మళ్లీ మీకు అర్థం కావట్లా.. మా మేనేజర్ తో మీకు పర్సనల్ ఓకే అయితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారు అని చెప్పాడు. నాకు దెబ్బకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఆ తర్వాత వెంటనే నో చెప్పాను. ఆ తర్వాత పర్సనల్ గా వద్దనుకుంటే హోస్టింగ్ వరకు చేయండి అని చాలాసార్లు కాల్ చేశారు. కానీ, నాకు భయం వేసి రానని చెప్పేశాను’ అంటూ గీతూ రాయల్ తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. గీతూ రాయల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.