సెలబ్రిటీలు మంచి గుర్తింపు కోసం గ్లామరస్ ఫోటో షూట్ లు చేయడం.. వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడం సహజం. ఈ క్రమంలో ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా వారి గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఫోటోషూట్ విభిన్నంగా ఉండేలా కోరుకుంటారు. అలా చేసే క్రమంలో కొన్ని ఫోటోలు అందరిని ఆకట్టుకుంటాయి. మరికొన్ని విమర్శలకు దారితీస్తాయి. తాజాగా జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరీ బాత్ టబ్ లో కూర్చుకుని తింటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలపై నెటిజన్లు ఓరేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.
రీతూ చౌదరీ.. ఎన్నో షార్ట్ ఫిల్మ్ లో నటించి మంచి గుర్తింపు పొందింది. సీరియల్స్ లోకి వచ్చి నటి సక్సెస్ అయ్యింది. సీరియల్ లో లేడీ విలన్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈక్రమంలో జబర్దస్త్ షో పాల్గొని మంచి గుర్తింపు సంపాదించింది. ఈ షో ద్వారా అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి షేర్ చేస్తుంటుంది. ఇలా సోషల్ మీడియాలో నిత్యం తన హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారు మతులు పోగొట్టే రీతూ చౌదరి తాజాగా ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇదీ చదవండి: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. శుభాకాంక్షలు తెలుపుతున్న ఫ్యాన్స్!
ఈ ఫోటోలలో ఈ జబర్దస్త్ బ్యూటీ ఏకంగా బాత్ టబ్ లో కూర్చుని ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాకుండా, బాత్ టబ్ లో తింటూ కూడా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఫోటోలపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. నీకు తిన్నడానికి ఇంతకంటే మంచి ప్లేస్ దొరకలేదా! అంటూ కామెంట్లు చేయగా.. మరికొందరు దరిద్రం అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. గుర్తింపు కోసం ఇలాంటి ఫోటో షూట్ లో కామనే అంటూ మరికొందరు నెటిజన్లు రీతును సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. రీతూ చౌదరి ఫోటోల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.