సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేశ్‌బాబు (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పతికి తరలించారు. అయితే అప్పటికే రమేశ్‌బాబు మరణించినట్లు వైద్యులు తెలిపారు. రమేష్ బాబు మరణ వార్త ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారిని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ప్రస్తుతం రమేష్ బాబు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరిలో మదిలో ఒకటే ప్రశ్న. అన్న అంత్యక్రియలకు మహేష్ బాబు హాజరవుతాడా లేదా అనే సందిగ్ధం నెలకొంది.
కారణం ఏంటంటే.. కొన్ని రోజుల క్రితమే మహేష్ బాబు కరోనా బారిన పడ్డాడు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్లు మహేష్ బాబు వెల్లడించారు. ఇలాంటి సమయంలో ఆయన అన్న అంత్యక్రియలకు హాజరు కాడనే తెలుస్తోంది. అంతేకాక కరోనా నేపథ్యంలో అభిమానులు ఎవరు కూడా రమేష్ బాబు భౌతిక కాయాన్ని సందర్శించేందుకు రావద్దని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.
ఇది కూడా చదవండి : రమేష్ బాబు చేయాలనుకున్న ఆ సినిమా.. రెండు సార్లు ఆగింది
దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ అంత్యక్రియల్లో పాల్గొనాలని అనుకోవద్దు.. ఎవరికి వాళ్లు ఇంటి నుంచి రమేష్ బాబుకు నివాళులు అర్పిస్తే మంచిది అని తెలిపారు. బయట పరిస్థితి బాగోలేకపోవడంతో ఘట్టమనేని కుటుంబమే ఈ ప్రకటన జారీ చేసింది. మహేష్ బాబుకు కరోనా సోకడంతో.. ఆయన కుటుంబ సభ్యులు నలుగురు కూడా ఇప్పుడు క్వారంటైన్ లో ఉన్నారు. మహేష్ బాబు కోవిడ్ పాజిటివ్ కనుక అన్న రమేష్ బాబు అంత్య క్రియలకు హాజరు అయ్యే అవకాశాలు దాదాపు లేవనే అంటున్నారు. ఈ పరిస్థితులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : మహేష్ బాబుకు కరోనా.. స్వయంగా తెలిపిన సూపర్ స్టార్