సినిమాటిక్ యూనివర్స్.. ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటున్న విషయం. ఇదివరకు సినిమాటిక్ యూనివర్స్ అనేది ఎక్కువగా హాలీవుడ్ సినిమాల్లోనే చూసేవాళ్ళం. టాలీవుడ్ నుండి ఎప్పుడైతే దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమా రూపొందించి ఆ మ్యాజిక్ చేశాడు. అయితే.. రాజమౌళి తెరకెక్కించింది సినిమాటిక్ మల్టీవర్స్ కాదుగాని.. బాహుబలి ప్రపంచంలోకి మాత్రం అందరినీ తీసుకెళ్లాడు. తెలుగు సినిమా స్థాయిని, విజన్ ని రాజమౌళి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక ఆ తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలతో దర్శకుడు ప్రశాంత్ నీల్.. తన సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఒక్కొక్కరుగా ప్రశాంత్ నీల్ యూనివర్స్ లో సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు జాయిన్ అవుతున్నారు. ఇకముందు కూడా ప్రశాంత్ మల్టీవర్స్ తో ఏం చేయబోతున్నాడనే క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో రాజమౌళి, ప్రశాంత్ నీల్ గురించే మాట్లాడుకుంటున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో చాపకింద నీరులా తమిళ యువదర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు సౌత్, నార్త్ అంతటా విస్తరించింది. ఖైదీ, మాస్టర్ సినిమాలతో తన మార్క్ క్రియేట్ చేసుకున్న లోకేష్.. తాజాగా విక్రమ్ సినిమాతో తన ఆలోచన ఏ రేంజిలో ఉందో పరిచయం చేశాడు. ప్రస్తుతం విక్రమ్ సినిమా చూసినవారంతా లోకేష్ కనగరాజ్ యూనివర్స్ గురించి మాట్లాడుతున్నారు.
విక్రమ్ తర్వాత అసలు లోకేష్ ప్లాన్ కేజీఎఫ్ యూనివర్స్ ని మించిపోనుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో జానర్ లో మార్క్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు డార్క్ యాక్షన్ డ్రామా అంటే లోకేష్ పేరే మార్మోగిపోతోంది. ఖైదీ, మాస్టర్.. కొత్తగా విక్రమ్.. ఈ మూడు సినిమాలలో కామన్ పాయింట్ డ్రగ్స్.. దాన్ని ఛేజ్ చేసే క్రమంలో ఒక్కో తమిళ స్టార్ హీరో లోకేష్ యూనివర్స్ లో యాడ్ అవుతుండటం ప్రేక్షకుల ఊహకు కూడా అందటం లేదు. ఖైదీతో కార్తీ, మాస్టర్ తో దళపతి విజయ్, విక్రమ్ తో కమల్ హాసన్, సూర్య, ఫహద్ ఫాజిల్.. నెక్స్ట్ ఖైదీ 2 లేదా విక్రమ్ 2 రావచ్చు.
ఈ నేపథ్యంలో లోకేష్ కనగరాజ్ ఇండస్ట్రీలోకి వచ్చింది మాత్రం సాధారణ ఐడియాతో కాదని విక్రమ్ చూసినవారికి అర్థమవుతుంది. ఓ అండర్ వరల్డ్ డ్రగ్స్ మాఫియా వరల్డ్ లోకి ఒక్కో తమిళ స్టార్ హీరోని కలుపుకుంటూ.. తమిళ సినిమా స్థాయిని రెట్టింపు చేసే స్థాయిలో లోకేష్ యూనివర్స్ ఉండబోతుందా.. అంటే అవుననే చెప్పుకోవాలి. 1986లో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా లైన్ ని కంటిన్యూ చేస్తూ లోకేష్.. ఇప్పుడు తాను తెరకెక్కిస్తున్న సినిమాలకు స్టోరీని లింకప్ చేస్తున్న విధానం చూస్తుంటే.. ఏదో భారీ ప్లానింగ్ తోనే ఇండస్ట్రీలోకి వచ్చినట్లు అనిపిస్తుంది.
BB classic #Kaithi references and characters will also make their presence felt in #Vikram. The required permission was procured from DWP
Likely union of the deadly trio of @ikamalhaasan @Suriya_offl @Karthi_Offl in #Kaithi2 ?
Exciting Lokesh Cinematic Universe possibilities🔥
— Kaushik LM (@LMKMovieManiac) June 1, 2022
ఇదంతా చూస్తుంటే.. ముందు కార్తీ, తర్వాత దళపతి విజయ్.. ఇప్పుడు కమల్ హాసన్, సూర్య.. నెక్స్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్.. లోకేష్ యూనివర్స్ లో తమిళ స్టార్స్ అందరినీ ఒక్కచోట చేర్చి ఏదైనా సినిమాటిక్ మల్టీవర్స్ క్రియేట్ చేసే అవకాశం ఉందా.. అంటే ఖచ్చితంగా ఉందని సూచనలను విక్రమ్ సినిమాతో కలిగించాడు. అలాగే ఇదివరకు తెరకెక్కించిన స్టోరీ లైన్స్ చూస్తే ఒకదానికొకటి ఏదొక పాయింట్ లో లింకప్ చేస్తుండటం.. లోకేష్ మల్టీవర్స్ కి ఇది నాంది అనిపిస్తుంది. ముఖ్యంగా ఖైదీ సినిమా డ్రగ్స్ బేస్ చేసుకొని మొదలై.. ఎక్కడైతే ఎండ్ అయ్యిందో.. అక్కడినుండి విక్రమ్ సినిమా మొదలవుతుంది. కానీ కొత్త క్యారెక్టర్స్, కొత్త ట్విస్టులు.. కొత్త మలుపులు.. కానీ స్టోరీ లైన్ మాత్రం ఒక్కటే. అంటే.. లోకేష్ క్రియేట్ చేస్తున్న డ్రగ్స్ మాఫియా యూనివర్స్ లో కథ ఒక్కటే.. కానీ కథలోకి కొత్త కొత్త పవర్ ఫుల్ క్యారెక్టర్స్ ఎంటర్ అవుతుంటాయి. ఆ క్యారెక్టర్లకు ఒక్కొక్కరుగా తమిళ స్టార్ హీరోలను ఇన్వాల్వ్ చేస్తుండటం.. లోకేష్ మల్టీవర్స్ పై అంచనాలు పెంచుతున్నాయి. ఈ లెక్కన ఇప్పటివరకు తెలిసిన ప్రశాంత్ నీల్ వర్స్ కంటే పెద్ద ప్లాన్ తో లోకేష్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించే పనిలో ఉన్నాడా.. అందరు స్టార్స్ తో పాటు త్వరలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా లోకేష్ వర్స్ లో చేరినా ఆశ్చర్యపోయే అవసరం లేదనిపిస్తుంది.
Dilli Reference In #Vikram Almost Confirmed !🔥
Lokesh Kanagaraj Universe 💥 pic.twitter.com/3XPqVNQQFZ
— Rocky Bhai (@RockybhaiOffcl) June 1, 2022
కథలో దమ్మున్నప్పుడు సినిమా ఎన్ని భాగాలుగానైనా రావచ్చు. అందులో మున్ముందు ఎన్ని గొప్ప పాత్రలైనా క్రియేట్ అవ్వొచ్చు. ఆ పాత్రలలో ఎంతమంది స్టార్ హీరోలనైనా చూపించవచ్చు.. చూడవచ్చు. ఈ విధంగా లోకేష్ తమిళ హీరోలతో.. తమిళ సినిమా సత్తాను చూపేందుకు ఓ యూనివర్స్ సృష్టించనున్నాడా.. ఒకవేళ అది ఇప్పటివరకూ ఇండియన్ సినిమాలో చూడని స్థాయిలో ఉంటే.. కోలీవుడ్ ఇండస్ట్రీకే కాదు.. లోకేష్ పేరు ప్రపంచమంతా పాకిపోవడం ఖాయం అనిపిస్తుంది. సైలెంట్ గా వచ్చి ఇండస్ట్రీలో తాను సృష్టించబోయే మల్టీవర్స్ ప్రపంచాన్ని ప్రీ ప్లాన్ తోనే లోకేష్ కనగరాజ్ రెడీ చేస్తున్నాడా.. అనేది ప్రస్తుతం ఊహకందని విషయంగా మారింది. మరి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మల్టీవర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Thank you for bringing me into the universe of #Vikram @dir_lokesh !! pic.twitter.com/M9AEMYGjcG
— Fahadh Faasil (@FahadhfaasiI) May 31, 2022
Hearing from sources that #Vikram will also heavy #Kaithi references . It’s going to @Dir_Lokesh ‘s universe. So #Kaithi2 with @Suriya_offl , @Karthi_Offl and the man himself @ikamalhaasan 🔥?Buzz: the makers of Vikram sought permission from @DreamWarriorpic to use these names
— Rajasekar (@sekartweets) June 1, 2022