మన దేశంలో రాజకీయాలకు, సినిమాలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమా రంగంలో రాణించిన పలువురు.. రాజకీయాల్లో కూడా విజయవంతంగా రాణించారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీ స్థాపించి.. ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆ తర్వాత పలువురు నటీనటులు.. రాజకీయాల్లో ప్రవేశించి.. రాణించారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి.. ఎన్నికల్లో పాల్గొని.. పార్టీ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే భారీ స్థాయిలో సీట్లు గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల నుంచి వైదొలిగి.. సినిమాల మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి.. ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఈ క్రమంలో మరో ప్రముఖ నిర్మాత పొలిటికల్ ఎంట్రీ గురించి ఇటు ఫిల్మ్ నగర్‌లో.. అటు రాజకీయా వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సక్సెస్‌ఫుల్ చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకోవడమే కాక.. టాలీవుడ్ ఇండస్ట్రీ బడా నిర్మాతల జాబితాలో ఒకరు. దిల్ సినిమాతో ఇండస్ట్రీతలోకి ఎంట్రీ ఇచ్చాడు. వరుస సినిమాలు నిర్మిస్తూ.. డిస్ట్రిబ్యూటర్‌గా విజయంవతంగా కొనసాగుతన్న దిల్ రాజ్ తన రూటు మార్చుకోబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారని ఫిల్మ్ నగర్‌లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన పొలిటకల్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారని సమాచారం.ఇక దిల్ రాజు స్వస్థలం తెలంగాణ, నిజామాబాద్ జిల్లా, మోపాల్ మండలం, నర్సింగ్ పల్లి నుంచే తన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి దిల్ రాజు ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నర్సింగ్ పల్లి నిజామాబాద్ రూరల్ పరిధిలోకి వస్తుంది. ఇక ప్రత్యక్ష ఎన్నికల్లోకి వస్తే.. ఈ నియోజకవర్గం నుంచే బరిలో దిగాలని దిల్ రాజు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తన స్వగ్రామం నర్సింగ్ పల్లిలో పలు సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. గ్రామంలో వెంకటేశ్వర ఆలయ నిర్మాణం, మాపల్లె ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవన్ని ఆయనకు పొలిటికల్‌గా కలిసి వస్తాయని భావిస్తున్నారట.
కారెక్కుతారా?.. బీజేపీ వైపా!
రాజకీయాల్లోకి వస్తారు సరే.. మరి ఇంతకు ఆయన ఏ పార్టీలో చేరతారనే దాని గురించి జోరుగా చర్చ సాగుతోంది. దిల్ రాజు మాత్రం టీఆర్‌ఎస్‌లేదా బీజేపీలో చేరాలని భావిస్తున్నారట. ఇందుకు తగ్గట్టుగానే రెండు పార్టీల కీలక నేతలతో దిల్ రాజు టచ్‌లో ఉన్నారట. ఏ పార్టీలో చేరతారనే దాని గురించి తెలియాలంటే.. మరి కాస్త సమయం పడుతుంది. ఒకవేళ టీఆర్‌ఎస్ నుంచి టికెట్ లభించకపోతే.. బీజేపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడేలోపు దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దిల్ రాజు ఇప్పటికే.. నిజామాబాద్ రూరల్ జిల్లాల్లోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తే.. తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని లోకల్ లీడర్లు భావిస్తున్నారట. ఇక ఆయన ఏ పార్టీలో చేరతారనే దాని గురించి క్లారిటీ లేకపోయినా.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మాత్రం పక్కా అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక దిల్ రాజు హైదరాబాద్‌లోనే స్థిరపడ్డా.. సొంతూరుతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. తరచుగా అక్కడకు వెళ్లి బంధుమిత్రులను కలుసుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన సొంతూరు నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. దిల్ రాజు మాత్రం తప్పకుండా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని ఆయన సన్నిహితులు అంటున్నారు. మరి సినిమాల్లో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు.. రాజకీయాల్లో కూడా అలానే విజయం సాధిస్తారో లేదో చూడాలి. మరి దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్ కు రూ.1,000 కోట్ల ఆఫర్ ప్రకటించిన KA పాల్!