సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ బంధాలన్ని.. కృత్రిమమైనవే.. అవసరం ఉన్నంత వరకే ఉంటాయనే టాక్ ఉంది. ఇక సినిమా పరిశ్రమలో లవ్ ట్రాక్, బ్రేకప్ వార్తలకు కొదవే ఉండదు. సినీ ఇండస్ట్రీకి చెందిన వారి ప్రేమ, పెళ్లి వ్యవహారాలు జనాలకు ఎప్పుడు ఆసక్తిని కలిగిస్తాయి అనడంలో సందేహంలేదు. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ ప్రేమ, పెళ్లి గురించి ఫిల్మ్ నగర్‌లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: శ్రుతిహాసన్ తో తన పెళ్లి జరిగిపోయిందంటూ శంతను కామెంట్స్..
హీరోయిన్ విమలా రామన్.. తమిళ నటుడు, విలన్ పాత్రలకు పెట్టింది పేరు అయిన వినయ్ రాయ్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. గత కొంతకాలంగా వీరి లవ్ ట్రాక్ నడుస్తోంది. ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని విహారయాత్రలు, డిన్నర్ డేట్‌లంటూ తెగ ఎంజాయ్ చేస్తూ.. అప్పుడప్పుడు మీడియా కంటికి కూడా చిక్కుతుంటారు. ఈ నేపథ్యంలో వీరి గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ప్రేమలో మునిగి తేలుతున్న వీరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. తమ లవ్ గురించి పెద్దలకు చెప్పి.. వారిని ఒప్పించారట. త్వరలోనే వీరద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ప్రముఖ నిర్మాత!మోడల్‌గా కెరీర్ ఆరంభించిన విమలా రామన్.. క్రమంగా హీరోయిన్‌గా ఎదిగింది. మొదట మలయాళ సినిమాల్లో నటించిన ఆమె.. తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ”గాయం-2, చట్టం, ఎవరైనా.. ఎపుడైనా, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి” లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక వినయ్ రాయ్ విషయానికొస్తే.. ‘ఉన్నాలే ఉన్నాలే’ సినిమాతో తమిళ నటుడిగా పరిచయమై ‘జయం కొందాన్, ఎంద్రెంద్రమ్ పున్నగై’ లాంటి సినిమాల్లో హీరోగా చేసి ‘డిటెక్టివ్, చంద్రకళ, వరుణ్ డాక్టర్, ఈటీ (ఎవరికీ తలవంచడు)” తదితర సినిమాల్లో విలన్‌గా ప్రేక్షకులను అలరించాడు. మరి వీరి పెళ్లి పిలుపు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ప్రభాస్ పెళ్లి విషయంలో రాజమౌళి సెటైర్లు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.