సూపర్ స్టార్ మహేష్ బాబు.. అమ్మాయిల కలల రాజకుమారుడు. ఆయనకు అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 46 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ మహేష్ బాబు అంటే అందరికీ అదే పిచ్చి. అందగాడు అనే పదానికి మహేష్ తప్ప మరో నిదర్శనం లేదంటుంటారు ఫ్యాన్స్. అంతగా ఇమేజ్ సంపాదించుకున్నాడు సూపర్ స్టార్. మరి.. మహేష్ ఇంత అందంగా ఉండానికి కారణం ఏంటి? ఆయన ఎలా మెయింటైన్ చేస్తాడు? అని ప్రతి ఒక్క అభిమానిలో మదిలో మెదిలే ప్రశ్న. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుమ అడిగిన ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం దొరికింది.
మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం తెరకెక్కించిన చిత్రం “సర్కారు వారి పాట” సినిమా మే12 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలకు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అనుహ్యమైన స్పందన లభించింది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండంటంతో ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు చిత్ర బృందం. తాజాగా సర్కారు వారి పాట టీమ్ తో యాంకర్ సుమ ఇంటర్వ్యు జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ ఇంటర్వ్యూలో మహేష్..సినిమా, తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు అందం, ఆరోగ్య రహస్యల గురించి సుమ ప్రశ్నలు అడిగింది. మహేష్ మాట్లాడుతూ.. “చాలా వరకు అన్నీ తింటాను, కానీ లిమిట్స్ లో తింటాను.
పెరుగు, డైరీ ప్రోడక్ట్స్, పిజ్జాలు, బర్గర్, బ్రెడ్, జంక్ ఫుడ్ లాంటివి అస్సలు తినను. పిల్లలతో ఉన్నప్పుడు సరదాగా స్వీట్స్ లాంటివి కొన్ని తింటాను వాళ్ళ కోసం. ఆల్మండ్ మిల్క్ తో చేసిన పదార్థాలు తింటాను. దాదాపు ఒక 10 ఏళ్లకు పైనుంచే ఫుడ్ లో కేర్ తీసుకుంటున్నాను. మొదట కష్టంగా ఉంటుంది కానీ తర్వాత అలవాటు అయిపోతుంది” అని తెలిపారు. డైరెక్టర్ పరుశురాం మాట్లాడుతూ..ట్రైలర్లో అందం గురించి మెయింటైన్ చేయలేక దూల తీరిపోతుంది అని చెప్పిన డైలాగ్ ని మహేష్ గారిని చూసే పెట్టానన్నారు. మరి.. మహేష్ బాబు చెప్పిన తన సీక్రెట్ విషయాల గురించి మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.