Gopichand: స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు గోపీచంద్. కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేసి, మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. తర్వాత హీరో పాత్రలకే పరిమితం అయ్యారు. గోపీచంద్ కెరీర్‌లో హిట్టు సినిమాలకంటే ప్లాపు సినిమాలే ఎక్కువ. గత ఐదేళ్లనుంచి వరుస అపజయాల్లో ఉన్నారాయన. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మైసూర్‌లో జరుగుతోంది. మైసూర్‌లో షూటింగ్ సందర్భంగా గోపీచంద్ గాయపడ్డారు. ఓ ఫైట్ సీన్ కోసం డూప్‌లేకుండా స్టంట్స్ చేసిన గోపీచంద్.. ప్రమాదవశాత్తు కాలు జారి ఎత్తునుంచి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు శ్రీవాస్ తన ట్విటర్ వేదికగా తెలిపారు.
షూటింగ్ సందర్భంగా ఆయన కాలు జారి కిందపడ్డారని, దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదమేమీ జరగలేదని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా, మారుతీ దర్శకత్వంలో గోపీచంద్ నటించిన ‘‘పక్కా కమర్శియల్’’ సినిమా జులై 1న విడుదల కానుంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశీ ఖన్న నటించింది. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు నిర్మిస్తున్నారు. మరి, త్వరలో విడుదల కానున్న ‘‘పక్కా కమర్శియల్’’ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Just spoke with Our Macho star @YoursGopichand garu
While shooting for his next he
just fell down due to leg slip. By God’s grace nothing happened to him and he is doing completely fine ♥️. pic.twitter.com/ZXZYUHXUUj— SKN (Sreenivasa Kumar) (@SKNonline) April 29, 2022
ఇవి కూడా చదవండి : Koratala Siva: కొరటాల శివ దెబ్బకి భయపడుతున్న Jr.NTR ఫ్యాన్స్!