తెలుగు టీవీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ‘ ఒకటి. ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే ఈ షో ద్వారా సరికొత్త ఇన్స్పైరింగ్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఈ షో నుండి తాజాగా ప్రోమో రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ ప్రోమోలో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను హైలైట్ అవుతున్నాడు.
ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో నాటక రంగానికి చెందిన కళాకారులు, నాటక రంగ జీవితాలపై స్పెషల్ ఫోకస్ చేశారు. ఈ క్రమంలో నాటకరంగానికి చెందిన కొందరు డ్రామా కంపెనీవారు నాటకాలు వేశారు. అనంతరం గెటప్ శ్రీను.. నాటక రంగ కళాకారుల జీవితాలపై చేసిన స్కిట్ అందరితో కంటతడి పెట్టించింది. నిజంగా నాటకాలు వేసుకునే వారి జీవితాలలో కష్టాలు, అవమానాలు ఇంత దారుణంగా ఉంటాయా అనేది శ్రీను తన నటనతో ప్రదర్శించాడు.ముఖ్యంగా నాటకరంగం నుండి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేవారి కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించి అందరినీ ఏడిపించేసాడు. గెటప్ శ్రీను యాక్టింగ్ చూసినవారంతా ఎమోషనల్ అయిపోయి శభాష్ అంటున్నారు. మామూలుగానే గెటప్ శ్రీను ఏ పాత్రైనా పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. అలాంటిది యాక్టింగ్ స్కోప్ ఉన్న స్కిట్ దొరికేసరికి జీవించి కన్నీళ్లు పెట్టించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ కొత్త ప్రోమో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.