నేచురల్ స్టార్ నాని విభినన్నమైన చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఇటీవల నాని నటించిన చిత్రం.. శ్యామ్ సింగ రాయ్ భారీ హిట్ అందుకుంది. కథల విషయంలో వైవిధ్యం చూపిస్తున్న నాని.. తాజాగా “అంటే సుందరానికీ” అనే విభిన్నమైన చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రాన్ని జూన్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన దర్శకుడు వివేక్ ఆత్రేయ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో నాని తనకు వార్నింగ్ ఇచ్చాడని వెల్లడించాడు.
“మెంటల్ మదిలో”, “బ్రోచేవారెవరురా” లాంటి డిఫరెంట్ కథాంశాలతో దర్శకుడిగా వివేక్ ఆత్రేయ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. నేచురల స్టార్ నానితో “అంటే సుందరానికీ!” అనే సినిమాను వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నాడు. చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మలయాళ భామ నజ్రియా నజీమ్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఆమెకు నేరుగా తెలుగులో ఫస్ట్ మూవీ ఇదే. ఈ సినిమా రిలీజ్ కు దాదాపు రెండు నెలలు సమయం వున్నా మేకర్స్ ఇప్పడే ప్రమోషన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ క్రమంలో ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియాతో దర్శకుడు వివేక్ ఆత్రేయ ముచ్చటించాడు.
ఇదీ చదవండి: అంటే సుందరానికీ టీజర్ అవుట్.. మీకింకా అసలు విషయం చెప్పలేదంటున్న నాని!కథ విషయంలో, హీరోయిన్ విషయంలో హీరో నాని తనకు వార్నింగ్ ఇచ్చాడని వెల్లడించారు. “మొదటి సారి నాని గారికి కథను వినిపించాను. ఆ సమయంలో సగం కథ మాత్రమే నా మైండ్ లో ఉంది. అదే ఆయనకు వినిపించాను. చాలా ఆసక్తిగా విన్నారు. ఆ తరువాత 2 నుంచి 3 వారాల తరువాత సెకండ్ పార్ట్ వినిపించాను. నాని కథను ఓకే చేశారు. ఇక హీరోయిన్ విషయంలో నజ్రియా అయితే బాగుంటుందని ఇద్దరం అనుకున్నాం. అయితే నాకు చెప్పినట్లు గా నజ్రియాకు కథ చెప్పకు. ఆమెకు కథ చెప్పే ముందు జాగ్రత్త అని నాని హెచ్చరించారు” అని మూవీ ప్రమోషన్ లో భాగంగా వివేక్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరి.. దర్శకుడు వివేక్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.