ఇళయ దళపతి విజయ్.. గూఢచారిగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘బీస్ట్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డె హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఉదయం నుంచి థియేటర్ల వద్ద విజయ్ అభిమానుల హంగామా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని పలు థియేటర్లలో ఉదయం 4 గంటలకే మొదటి షో రిలీజ్ చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా పాజిటీవ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చెన్నైలో విజయ్ ఫ్యాన్స్.. బీస్ట్ సినిమా చూసిన ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
చెన్నైలో బీస్ట్ సినిమా చూసిన వారికి పెట్రోల్ ఫ్రీగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ‘విజయ్ మక్కళ్ ఇయక్కం’ తరపున బీస్ట్ సినిమా చూడడానికి వస్తున్నవారికి కూడా పెట్రోల్ ఫ్రీగా ఇస్తున్నారు. మరోవైపు చెన్నై లోని విరుద్ నగర్ లోని రాజ్యలక్ష్మి, అమృతరాజ్ థియేటర్లలో బీస్ట్ కోసం టికెట్స్ తీసుకునేవారికి ఇదే తరహా ఆఫర్ ప్రకటించాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. బీస్ట్ సినిమా కోసం 5 టికెట్స్ కొన్నవారికి లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నట్లు సమాచారం. బీస్ట్ సినిమా విడుదల సందర్భంగా చెన్నైలోని కొన్ని ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు సెలవులు ప్రకటించాయి. మరి.. ఇలా విజయ్ అభిమానులు..బీస్ట్ సినిమా చూసిన వారికి పెట్రోల్ ఆఫర్ ప్రకటించడం పట్ల మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.