మన దేశంలో సినిమా వాళ్లకు, క్రికెటర్లకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే ఎవరికి సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా సినిమా వారికి ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక అభిమాన హీరో సినిమా విడుదల సమయంలో, ప్రీ రిలీజ్ వేడుకల వేళలో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక అభిమాన హీరో పుట్టినరోజు నాడు వారు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వారిని అదుపు చేయడం పోలీసులు వల్ల కూడా కాదు. గురువారం అర్థరాత్రి జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. శుక్రవారం (మే 20) ఎన్టీఆర్ 39వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి గురువారం అర్థరాత్రి అభిమానులంతా ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఇంట్లో లేకపోవడంతో.. ఆయన రాకకోసం రోడ్డుపైనే ఎదురుచూశారు. ఈ క్రమంలో కొంతమంది అభిమానులు రోడ్డు మీదే కేక్ కట్ చేసి.. జై ఎన్టీఆర్ అంటూ రోడ్డుపై హంగామ సృష్టించారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. కాసేపు ఆ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దాంతో పోలీసులు వచ్చి అభిమానులను అక్కడి నుంచి తరలించారు.
ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా బలంగా కోరుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకే సందర్భం వచ్చిన ప్రతి సారి వారు తమ మనసులోని మాటలను ఇలా బహిర్గతం చేస్తుంటారు. ఇక తన పొలిటికల్ ఎంట్రీ గురించి తారక్ ట్రిపుల్ ఆర్ సినిమా సక్సెస్ మీట్ సమయంలో క్లారిటీ ఇచ్చిన విషయం విదితమే. ప్రస్తుతానికి తన దృష్టి అంతా సినిమాల మీదనే ఉందని.. రాజకీయాల గురించి ఆలోచించడం లేదని తెలిపారు. ‘ఫ్యాన్స్ అందరినీ తృప్తి పరచడానికి మంచి సినిమాల్లో నటించడం, మంచి పాత్రలు పోషించడంపైనే దృష్టి పెట్టాను. సమయం వచ్చినప్పడు తాత గారి అడుగు జాడల్లో నడుస్తా’ అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆయన పుట్టిన రోజునాడు ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడంతో మరోసారి తారక్ పొలిటికల ఎంట్రీ హాట్ టాపిక్‌గా మారింది. మని దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.