తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కార్యక్రమాల్లో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఎప్పుడూ ముందే ఉంటాయి. ఈటీవీలో ప్రతి శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రాం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కొన్నేళ్లుగా బుల్లితెర పై సందడి చేస్తున్న ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో యూట్యూబ్ వేదికగా కొత్త రికార్డు సృష్టించింది. తాజాగా రిలీజైన ప్రోమో ఒక్క రోజులోనే 4 మిలియన్ల వ్యూస్, లక్షకి పైగా లైక్స్ దక్కించుకుంది.
ముఖ్యంగా ఈ ప్రోమోలో సుడిగాలి సుధీర్ టీమ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సుధీర్ పుష్పరాజ్ గెటప్ లో కనిపించగా, గెటప్ శ్రీను ఫహద్ ఫాజిల్ పోషించిన పోలీస్ షెకావత్ గా అలరించాడు. అలాగే ప్రోమోలో హైలైట్స్ చూసుకుంటే.. బుల్లెట్ భాస్కర్, రాకింగ్ రాకేష్, వెంకీ మంకీస్, రోహిణి అందరూ తమదైన స్టైల్ లో అదరగొట్టారు.
మరి ప్రోమోతో యూట్యూబ్ లో రికార్డు నమోదు చేసిన ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ఫుల్ ఎపిసోడ్ ని ఈరోజు రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో చూడవచ్చు. ఇటీవల టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన పుష్ప సినిమా స్కిట్.. ఎపిసోడ్ పై అంచనాలు పెంచేసిందని చెప్పాలి. మరి ఈ లేటెస్ట్ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోని మీరు కూడా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.