తెలుగు హీరోయిన్స్ ఈ మధ్యకాలంలోనే టాలీవుడ్ ని దాటి ఆలోచిస్తున్నారు. అందుకే తెలుగు మాత్రమే కాకుండా వేరే భాషల్లో అవకాశాలు వస్తే ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అప్ కమింగ్ మలయాళం - తమిళ బైలింగ్వేల్ 'ఒట్టు' అనే సినిమాతో ఈషా రెబ్బా.. మల్లు ఇండస్ట్రీలో డెబ్యూ చేయబోతుంది. డైరెక్టర్ ఫెల్లిని తెరకెక్కిస్తున్న ఈ ఒట్టు సినిమాలో కుంచాకో బోబన్ హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే మలయాళం ఇండస్ట్రీలో డెబ్యూ చేయనుండటంతో.. ఈషా ఈ సినిమా పట్ల తన ఎక్సయిట్ మెంట్ గతంలోనే బయటపెట్టింది. ఇక సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెబుతూ.. 'ఈ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. దీనికోసం చాలా మేకోవర్ అవ్వాల్సి వచ్చింది. కానీ చివరిగా క్యారెక్టర్ లో నన్ను చూసి ఫ్యాన్స్ అంతా షాక్ అవుతారు. తెలుగు వాళ్లు కూడా నన్ను మరో కొత్త అవతారంలో చూడబోతున్నారు' అని చెప్పుకొచ్చింది.గతంలో చెప్పినట్లుగానే ఈషా మాట నిలబెట్టుకుందని.. బోల్డ్ సన్నివేశాలలో రెచ్చిపోయి నటించి నిజంగానే షాక్ ఇచ్చిందని నెటిజన్లు చెబుతున్నారు. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఒట్టు సినిమా నుండి కొత్తగా ఓ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ లో ఈషా, హీరో బోబన్ ల మధ్య సీన్స్ చాలా బోల్డ్ గా ఉన్నాయి. ఈ పాటలో ఈషా ఓ రేంజిలో రెచ్చిపోయి నటించడం ఫ్యాన్స్ కి షాకిస్తుంది. ఎందుకంటే.. ఇంతకాలం బోల్డ్ సన్నివేశాలకు దూరంగా ఉన్న ఈషా.. ఇలా ఒక్కసారిగా బోల్డ్ సీన్స్ లో కనిపించేసరికి ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సి వస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి తాజాగా విడుదలైన ఈషా రొమాంటిక్ సాంగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.