నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్ లో మాస్ కి కేరాఫ్ అడ్రెస్. బాలయ్య నుండి వచ్చే ప్రతి సినిమాలో ఫైట్స్ అదిరిపోతాయి. డైలాగులు ఒక రేంజ్ లో ఉంటాయి. ఫ్యాన్స్ చేత విజిల్స్ వేపించేలా బాలయ్య యాక్షన్ సీక్వెన్స్ లలో రెచ్చిపోతుంటారు. మరి.. ఇలాంటి మాస్ హీరో పక్కన విలన్ గా చేయాలంటే ఆషామాషీ విషయం కాదు. నందమూరి నట సింహాన్ని ఢీ కొట్టి.. స్క్రీన్ పై సరిగ్గా చెలరేగితే వారికి కూడా మంచి పేరు వస్తుంది. ఇందుకే.. బాలయ్య సినిమాలలో విలన్ గా చేయడానికి స్టార్ స్టార్ హీరోలు సైతం పోటీ పడుతుంటారు. ఇప్పటికే ఈ లిస్ట్ లో జగపతిబాబు, శ్రీకాంత్ వంటి హీరోలు చేరిపోగా.., ఇప్పుడు ఓ కన్నడ మాస్ హీరో బాలయ్య సినిమాలో విలన్ గా నటించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
‘క్రాక్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుని దర్శకుడిగా మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు గోపీచంద్ మలినేని. ఈ ఊపులోనే బాలయ్యతో ఓ మాస్ ఎంటర్టైనర్ మూవీ చేయడానికి మలినేని సిద్దమయ్యాడు. కర్ణాటక బోర్డర్ లో జరిగే ఫ్యాక్షన్ కథతో ఈ సినిమాని తీయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ లాంటి మాస్ హీరోని ఎదుర్కోవడానికి.. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ని బాలయ్య సినిమాలో విలన్ గా సెలక్ట్ చేసుకున్నాడు దర్శకుడు. తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం విశేషం.
దునియా విజయ్ కన్నడలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ‘దునియా’ మూవీ సూపర్ హిట్ కావడంతో ఆ సినిమానే తన ఇంటి పేరుగా మారిపోయింది. ఇప్పటి వరకు నలభై సినిమాల్లో నటించిన విజయ్ కన్నడలో పక్కా మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే దునియా విజయ్ హీరోగా నటించిన ‘సలాగా’ మూవీ కన్నడలో మంచి విజయాన్ని అందుకోవడం విశేషం. మరి.. శాండిల్ వుడ్ లో ఇంతటి స్టార్డమ్ ఉన్న దునియా విజయ్.. మన మాస్ కా బాప్ బాలయ్యకి ధీటుగా ఎంతవరకు నటించి మెప్పిస్తాడో చూడాలి.
Team #NBK107 welcomes Sandalwood Sensation #DuniyaVijay on board for a powerful role 💥💥
NataSimham #NandamuriBalakrishna @shrutihaasan @officialviji @megopichand @MusicThaman pic.twitter.com/AG9epNSS3L
— Mythri Movie Makers (@MythriOfficial) January 3, 2022