సింగర్ పార్వతి.. ఈ పేరుకు తెలుగురాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది పార్వతి. అంతేకాదు తన పాటతో తన ఊరికి, తన ఊరి ప్రజలకు ఏదో చేయాలనే తపన అందరూ ఆమెకు అభిమానులుగా మారేలా చేసింది. ఊరి ప్రజల కొన్నేళ్ల కలను తన పాటతో నెరవేర్చింది. ఒక మనిషిని అభిమానించడానికి ఆకారం కాదు.. మంచి మనసు ముఖ్యం అని రుజువు చేసింది. ఆమె పాటకు ప్రేక్షకులే కాదు.. సెలబ్రిటీలు సైతం అభిమానులుగా మారడం చూశాం. తాజాగా ఆ జాబితాలోకి డీజే టిల్లు కూడా చేరిపోయాడు.
ఇదీ చదవండి: సినిమాల్లో కూడా ఈ రాజకీయాలేంటో..?: ప్రకాష్ రాజ్
జీ తెలుగు ప్రత్యేకంగా జీ సూపర్ ఫ్యామిలీ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆ కార్యక్రమం లాఛింగ్ ను అట్టహాసంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి డీజే టిల్లు జొన్నలగడ్డ సిద్ధు కూడా హాజరయ్యాడు. అక్కడ సింగర్ పార్వతి, ప్రణవ్ పాడిన గార్ల్ జస్ట్ లెట్ మీ బీ యువర్ మ్యాన్ సాంగ్ పాడారు. అందులో పార్వతి సింగింగ్ కు సిద్ధు ఫిదా అయిపోయాడు. అంతేకాకుండా క్రషర్ అంటూ ప్రణవ్ కు బిరుదు కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సింగర్ పార్వతి పర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.