Sudigali Sudheer: తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుధీర్ కు ఉన్న క్రేజే వేరు. కొన్నాళ్ల క్రితం జబర్దస్త్‌లోకి సామాన్య కంటెస్టెంట్‌గా వచ్చి.. తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగి.. నేడు బుల్లితెర సూపర్ స్టార్‌గా ఎదిగాడు సుధీర్. అయితే.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతడి తత్వమే సుధీర్ ని ఇంతటి స్టార్ గా మార్చింది. ప్రస్తుతం యాంకర్‌గా, కంటెస్టెంట్‌గా, హీరోగా రాణిస్తున్నాడు సుధీర్. జీవితంలో ఏదో సాధించాలనే కసితో హైదరాబాద్ వచ్చి.. మెజిషియన్‌గా కెరీర్ ప్రారంభించి.. నేడు ఈ స్థాయికి ఎదిగి.. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు సుధీర్. ఇక సుధీర్ తనని ఆదరించిన వారిని ఎప్పటికీ మరచిపోడు. తాజాగా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు నటుడు ధనరాజ్. సుధీర్ ను జబర్దస్త్ లోకి తీసుకొచ్చిందే ధనరాజ్. ముందుగా ధనరాజ్ టీమ్ లో ఉండే సుధీర్ కమెడియన్ గా నిలదొక్కుకున్నాడు.
అప్పటి నుండి ధనరాజ్- సుధీర్ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ధనరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధీర్ వ్యక్తిత్వం గురించి బయట పెట్టాడు. “కెరీర్ స్టార్టింగ్ లో సుధీర్ ఎలా ఉండేవాడో, అందరిని ఎంతలా గౌరవించేవాడో ఇప్పటికీ అలానే ఉన్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం అతనిది. ఇలాంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టే.. సుధీర్ ఇంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. చిన్నతనం నుండి సుధీర్ చూడని కష్టం లేదు. కుటుంబ భారాన్ని చిన్న వయసులోనే భుజానికి ఎత్తుకున్నాడు. తాను కస్టపడి ఎదుగుతూ వచ్చాడు. ఇండస్ట్రీలో ఒక రజనీకాంత్, ఒక చిరంజీవి ఎలాగో సుధీర్ కూడా అంతే.
ఈ తరం వారంతా సుధీర్ ను ఆదర్శంగా తీసుకోవాలంటూ ధనరాజ్ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ఇక ఇదే సమయంలో సుధీర్ పై ఉన్న ఓ మచ్చను కూడా తీసేసే ప్రయత్నం చేశాడు ధనరాజ్. అంతా సుధీర్ ను స్కిట్స్ లో చూసి రియల్ లైఫ్ లో కూడా అతను అమ్మాయిలతో అలానే ఉంటాడు అని అనుకుంటారు. కానీ.., సుధీర్ పార్టీలకు కూడా సరిగ్గా అటెండ్ కాదు. రాత్రి 9 తరువాత అతని మొబైల్ కూడా పని చేయదు. కానీ.., ఇంత స్టార్ డమ్ వచ్చాక కూడా సుధీర్ తనపై అలాంటి పంచ్ లు వేయించుకోవడం అనవసరం అంటూ ధనరాజ్ తన మనసులోని మాటని బయట పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ధనరాజ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Cash Program: క్యాష్ షోలో మెరిసిన జబర్దస్త్ ఆనంద్ భార్య! ఆమ్మో.. ఇది మామూలు ప్రేమ కాదుగా!