ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. అదే క్రమంలో తెలుగు పాటలకు స్టెప్పులు వేస్తూ.. వీడియోలు చేస్తూ సందడి చేస్తాడు. అదే విధంగా ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని సూపర్ హిట్ డైలాగ్.. పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదే లే అనే డైలాగ్‌ను అచ్చం ఐకాన్స్టార్లానే దించేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇంతకు ముందు ఇదే డైలాగ్‌ను టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా చెప్పాడు. ఆ వీడియోకు భారీ స్థాయిలో లైక్స్ వచ్చాయి. జడేజా ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో అత్యధిక లైక్స్ వచ్చిన వీడియో అదే కావడం విశేషం. మరి క్రికెటర్లు అల్లు అర్జున్ సినిమాలోని డైలాగ్స్‌ను అదరగొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ‘పుష్ప’ డైలాగ్‌తో అదరగొట్టిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ జడేజా