సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. పైకి చూసేవారికి అది ఎంతో అబ్బురంగా, అందంగా కనిపిస్తుంది. కానీ ఈ రంగుల లోకంలో నెగ్గుకురావడం అంత తేలిక కాదు. ఎన్నో అవమానాలు, కష్టాలు దాటుకుంటే కానీ విజయం సాధించలేం. ఇక మరీ ముఖ్యంగా యువతులు ఇండస్ట్రీలో రాణించడం అంటే కత్తి మీద సాములాంటిదే. అవకాశాల కోసం తిరిగితే.. మాకేంటి అనే అడిగే ప్రబుద్ధులు కోకొల్లలు. ఇక కొన్నాళ్ల క్రితం వచ్చిన మీటూ ఉద్యమం ఫలితంగా ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయో బయటి ప్రపంచానికి తెలిసింది.
ఇక టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలను పట్టించుకోరు అనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. అందం, ప్రతిభ ఉన్న ఎందరో తెలుగు యువతులు అవకాశాల కోసం నిరీక్షిస్తున్న మాట వాస్తవమే. ఇక్కడ తిరస్కారం ఎదుర్కొన్న వారు.. ఇతర ఇండస్ట్రీల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కోవకు చెందిన నటే.. రేఖా బోజ్. ప్రస్తుతం దామిని విల్లా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా రేఖా బోజ్.. ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి వివరించింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: Poonam Kaur: ‘పీకే’ అంటే ఏంటంటూ నెటిజన్ ప్రశ్న.. ఘాటుగా స్పందించిన పూనమ్ కౌర్!
రేఖా బోజ్ మాట్లాడుతూ.. నటనపై ఆసక్తితో డిగ్రీ చదువుతున్న రోజులలోనే తాను షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తెలిపారు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న తాను హీరోయిన్‌గా సినిమా అవకాశాల కోసం పలు ఆఫీసుల చుట్టూ తిరిగినట్లు తెలిపారు. సుమారు 50 సినిమాలకు పైగా ఆడిషన్స్ లో పాల్గొన్నానని ఈ సందర్భంగా రేఖా బోజ్ వెల్లడించారు. అయితే ఆడిషన్ కి వెళ్ళిన ప్రతి సారీ నువ్వు నయనతారలా ఉన్నావు అంటూ తన పై ప్రశంసలు కురిపించిన వారు ఉన్నారు కానీ, తనకు అవకాశం ఇచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరని ఆవేదన వ్యక్తంచేశారు. మరికొందరైతే తన పట్ల ఎంతో దారుణంగా మాట్లాడారని ఈ సందర్భంగా రేఖా తెలియజేశారు.
ఇది కూడా చదవండి: Supritha: కోపంతో ఊగిపోయిన సురేఖా వాణి కూతురు సుప్రీత! అలా పిలవద్దు అంటూ..! వీడియో వైరల్
ఇండస్ట్రీలోకి వచ్చే యువతులకు సాధారణంగా ఎదురయ్యే సమస్య కమిట్మెంట్ అనే టాక్ ఉంది. కొత్తగా ఇండస్ట్రీ లోకి వెళ్లే వాళ్ళు అవకాశాల కోసం ఇలా ఎంతో మంది దర్శక నిర్మాతలకు కమిట్మెంట్స్ ఇస్తూ ఉంటారనే టాక్ బయట వినిపిస్తుంది. ఈ క్రమంలోనే తాను ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు కొందరు నువ్వు కమిట్ మెంట్ ఇచ్చిన హీరోయిన్ అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. ఏదైనా సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ట్రై చేసుకో అంటూ మొహం మీదే చెప్పిన వాళ్లు కూడా ఉన్నారని రేఖా బోజ్ వెల్లడించారు. ఇలా కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న అవమానాలు గురించి బయట పెట్టారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. రేఖా బోజ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Kasthuri: గోళీసోడా చేతబట్టిన గృహలక్ష్మి.. అదోరకం ఆనందం! ఫోటోలు వైరల్!