తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ఈటీ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. జైభీమ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈటీ సినిమా చేశాడు. ఆ మూవీకి సంబంధించి హైదరాబాద్ లోనూ ప్రమోషన్స్ ఫుల్ జోష్ తో చేస్తున్నారు. ఆ సందర్భంగా ఓ ఇంట్రస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. అదే రానా- హీరో సూర్య మధ్య ఉన్న రిలేషన్ గురించి. గతంలో సూర్యా- రానాకు గట్టిగానే క్లాస్ పీకాడంట ఆ విషయాన్ని స్టేజ్ పైన స్వయంగా రానానే ప్రస్తావించాడు.
‘నేను ఇప్పుడు నుంచి కాదు.. పితామగన్(శివ పుత్రుడు) సినిమా నుంచి అతను హీరో సూర్య అని తెలియనప్పటి నుంచే పెద్ద అభిమానిని. ఆ తర్వాత ఇద్దరం కలుసుకున్నాం.. ఫ్రెండ్స్ అయ్యాం. పదేళ్ల క్రితం సూర్యా ఓరోజు నాతో నువ్వు యాక్టింగ్ చేయట్లేదు ఏదో మేనేజ్ చేస్తున్నావ్ అంటూ కారులో ఎక్కించుకుని దాదాపు 4 గంటలు తిప్పుతూ పెద్ద క్లాస్ పీకాడు. ఇప్పుడు బల్లాల దేవ అయినా, డేనియల్ శేఖర్ అయినా అలా పీకబట్టే అయ్యాను’ అంటూ రానా చెప్పుకొచ్చాడు.
ఈ గ్యాప్ లో రానాను చెప్పనివ్వకుండా సూర్యా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వారి మధ్య జరిగిన ఈ సంభాషణ, దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాకుండా వారి మధ్య ఉన్న బాండింగ్ ఎలాంటిదో కూడా చెప్పేలా ఉంది అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.