టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన మూవీ ఆచార్య. మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. ఇక కరోనాతో అనేక వాయిదాల నడుమ ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 29వ తేదీన విడుదలకు సిద్దంగా ఉంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆచార్య టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది.
అయితే తాజాగా రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి తాజాగా విడుదలైంది. అయితే ఇందులో సినిమాకు సంబంధించి అనేక విషయాలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రోమోలో చరణ్ మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో మా ఇద్దరి (చిరు-రామ్ చరణ్) మథర్స్ సెట్ లో కూర్చుని.. నా కొడుకు బాగా చేస్తున్నాడా? నీ కొడుకు బాగా చేస్తున్నాడా అని మమ్మల్ని చిన్న పోటీగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో పొలంలోకి వచ్చి వార్నింగ్ ఇచ్చే సీన్ నాకు బాగా నచ్చిందని చరణ్ తెలిపారు. సెట్ లో డైరెక్టర్ ఆయనకు (చిరంజీవి) ప్యాకప్ చెబితే బాధ, ఎందుకు ఇంత తొందరగా ప్యాకప్ చెబుతున్నారా అని చరణ్ చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినట్లు వీడియోలో అర్థమవుతోంది. అయితే ఈ పూర్తి వీడియో ఎప్పుడు విడుదల అవుతుందా అని మెగా ఫ్యాన్స్ అత్రుతగా ఎదురు చూస్తున్నారు. చరణ్ చిరంజీవిపై చేసిన ఫన్నీ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.