Aryan Khan: క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో క్లీన్ చిట్ ఇచ్చింది. ఆర్యన్ ఖాన్ అమాయకుండని శుక్రవారం స్పెషల్ కోర్టుకు సమర్పించిన తుది ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. సంఘటన జరిగిన సమయంలో ఆర్యన్ దగ్గర ఎటువంటి మత్తు పదార్థాలు లభించలేదని తెలిపింది. సరైన ఆధారాలు లభించని కారణంగా ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని వెల్లడించింది. మరో 14 మందిని ఛార్జ్‌షీట్లో చేర్చామని కూడా పేర్కొంది.
కాగా, ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ తీసుకున్నాడన్న ఆరోపణలతో 2021, అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారులు ఆర్యన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని ముంబైలోని ఆర్థర్ రోడ్‌లోని జైలుకు తరలించారు. ఇక అప్పటినుంచి బేయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరగటం మొదలైంది. ఈ నేపథ్యంలోనే 2021, అక్టోబర్ 28న బాంబే హైకోర్టు అతడికి బేయిల్ మంజూరు చేసింది.
ఇవి కూడా చదవండి : F3 Movie Review: వెంకటేశ్- వరుణ్ కాంబోలో వచ్చిన ‘F3’ మూవీ రివ్యూ!