భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘దక్షిణ్’ పేరుతో సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ సమ్మిట్.. రెండు రోజుల పాటు.. అనగా ఏప్రిల్ 9, 10 తేదీల్లో నందంబాక్కంలోని ట్రేడ్ సెంటరులో ఘనంగా జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేతుల మీదుగా ఈ సదస్సు ప్రారంభమయ్యింది. రెండ్రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో వివిధ అంశాలపై ప్రఖ్యాత సినీ సెలెబ్రిటీలు పాల్గొని చర్చించారు. ‘సాంస్కృతిక మూలాలు – ప్రపంచస్థాయి క్రియేటివిటీ’ అనే థీమ్‌తో సదస్సు నిర్వహించారు.
ఇది కూడా చదవండి: నాన్నే పోలీసులుకు ఫోన్ చేసి నన్ను అరెస్ట్ చేయించారు: సీఎం
తమిళనాడు సీఎం స్టాలిన్ చేతులు మీదుగా ప్రారంభమయిన ఈ సదస్సులో సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు దర్శకులు, నటీనటులు పాల్గొన్నారు. సదస్సులో స్టాలిన్ మాట్లాడుతూ.. సమాజానికి ఉపయోపగడేలా ప్రగతిశీల చిత్రాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని తెలిపారు. ఇక ఆజాదీ కా మహోత్సవ్ లో భాగంగా సాగుతున్న ఈ వేడుకలో నటీమణులు సుహాసిని, ఖుష్బూ, లిజీ, సుజాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. సదస్సుకు సంబంధించి ప్రతి కార్యక్రమానికి వీరు డ్రస్ కోడ్ పాటిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. సదస్సులో పాల్గొన్న వీరంతా సీఎం స్టాలిన్‌తో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: AP పథకాలపై తమిళనాడు సీఎం ప్రశంసలు!
స్టాలిన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కళారంగానికి సంబంధించి.. ఆయన హాజరైన తొలి కార్యక్రమం ఇదే కావడం విశేషం. ఇక సదస్సు సందర్భంగా అలనాటి హీరోయిన్లు.. సీఎం స్టాలిన్‌తో ఇలా ఫోటో దిగడం కూడా విశేషమే అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరలవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.