దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియెంట్ ఓమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా.. ఓమిక్రాన్ వ్యాప్తిని ఆపలేకపోతున్నాయి. అయితే.. కరోనా వైరస్ అనేది అభిమాన సినీతారలకు సోకే సరికి ఫ్యాన్స్ లో కంగారు మాములుగా ఉండదు. ప్రస్తుతం అలాంటి టెన్షన్ లోనే ఉన్నారు స్టార్ హీరో విక్రమ్ అభిమానులు.
ఎందుకంటే, తాజాగా విక్రమ్ కరోనా బారిన పడిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనితో చియాన్ విక్రమ్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. #Getwellsoonvikram అనే హ్యాష్ టాగ్స్ తో అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు హీరో విక్రమ్ పేరు పరిచయం అవసరం లేదు. సినిమా కోసం ఎంత రిస్క్ అయినా చేసే హీరోలలో విక్రమ్ ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. అలాంటి హీరోకి ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఫాన్స్ కంగారు పడుతున్నారు. ప్రస్తుతం విక్రమ్ కోబ్రా అనే సినిమాలో నటిస్తున్నాడు.