మెగా అభిమానులతో పాటు సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ఆచార్య. అవును తొలిసారి మెగాస్టార్ చిరంజీవి, కుమారుడు చరణ్ ఇద్దరు కలిసి ఫుల్ లెంగ్త్ రోల్‌లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. కరోనా కారణంగా వాయిదా పడుతూ.. చివరకు ఏప్రిల్ 29న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆచార్య సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. అలాగే ఆచార్య రన్ టైం 2 గంటల 34 నిమిషాలు లాక్ చేసినట్లుగా ట్విట్టర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
#Acharya Censor Done.
UA, 2 hours 34 minutes #Mirchi9Exclusive
— MIRCHI9 (@Mirchi9) April 21, 2022
ఇది కూడా చదవండి: అది అమ్మ కోరిక.. అందుకే ఆ సినిమా చేశా: రామ్ చరణ్
ఇక ఆచార్య సినిమాకు సెన్సార్ టాక్ ఎలా ఉందంటే.. సెకాండాఫ్‌తో పోల్చుకుంటూ.. ఫస్టాఫ్ యావరేజ్ అని.. ఇక లాస్ట్ 30 నిమిషాలు అయితే ఓ రేంజ్‌లో ఉంటుందని.. ఫ్యాన్స్‌కి పునకాలే అని టాక్ వినిపిస్తోంది. ఇక చిరు-చరణ్ కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయని.. మొత్తానికి ఆచార్యతో ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ వడ్డిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
#Acharya Censor Done & Inside Talk 👍 https://t.co/fJ2GOqAUyM pic.twitter.com/BDgwA1wf6x
— gupta (@guptanagu8) April 21, 2022
ఇది కూడా చదవండి: ఆచార్య సినిమా కోసం మహేశ్ బాబు వాయిస్ ఓవర్!
ఇక కొరటాల శివ సినిమాల్లో క్లైమాక్స్ వీక్‌గా ఉంటుందనే టాక్ ఉంది. ఆచార్య సినిమాతో కొరటాల ఆ కంప్లైంట్‌ని బ్రేక్ చేయబోతున్నాడట. ఆచార్య క్లైమాక్స్‌ని ఎక్సట్రార్డినరీగా ఓ రేంజ్‌లో డిజైన్ చేశారని సెన్సార్ టాక్ చెబుతోంది. ఇవన్ని మెగా అభిమానులను మరింత ఊరిస్తున్నాయి. ఇప్పటికే చిత్రం బృందం ఇంటర్వ్యూలతో ప్రమోషన్ కార్యక్రమాలని ప్రారంభించింది. ఇక ఏప్రిల్ 23న హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించనున్నారు మేకర్స్. చిరు-చరణ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Extraordinary reports for acharya 2nd half last 30mins kutha ramp anta
— Twopointoooh Fan (@Iam__praneeth) April 20, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.