నటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య చోటు చేసుకున్న వివాదం చిలికి చిలికి గాలివాన చందగా పెద్దదిగా మారింది. ఈ వివాదం కొనసాగుతుండగానే.. నటి కరాటే కళ్యాణి మీద వరుస ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. ఓ వ్యక్తి కరాటే కళ్యాణి వల్ల తనకు ప్రాణ హాని ఉందని తెలపగా.. ప్రస్తుతం ఆమె పెంచుకుంటున్న చిన్నారులకు సంబంధించి పలు ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. గత కొంతకాలంగా కరాటే కళ్యాణి ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను తన ఇంట్లో ఉంచిందని ఆమెపై ఫిర్యాదు రావడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, పోలీసులు ఆదివారం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అధికారులు తెలిపిన మేరకు.. సినీనటి కరాటే కళ్యాణి గత కొన్నేళ్ళుగా అక్రమంగా పిల్లలను తీసుకువచ్చి ఇంట్లో ఉంచుతుందని 1098 నెంబర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆదివారం ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని రాజీవ్‌నగర్‌కాలనీలో శ్రీలక్ష్మి నిలయం అపార్ట్‌మెంట్స్‌కు ఆదివారం వచ్చారు.
ఆ సమయంలో కళ్యాణి, పిల్లలు ఇంట్లో లేరు. ఆమె తల్లి మాత్రమే ఉంది. తన కుమార్తె గుడికి వెళ్లిందని.. ఎప్పుడు వస్తుందో తెలియదని.. కళ్యాణి తల్లి పోలీసులకు తెలిపింది. తన కుమార్తె.. ఒక బాబు (12 ఏళ్లు)ను, ఐదు నెలల పాపను పెంచుకుంటోందని, అందులో తప్పేముందని ఆమె ప్రశ్నించింది. అయితే వారిని ఎక్కడనుంచి తెచ్చిందనే విషయం మాత్రం తనకు తెలియదని తెలిపింది. అయితే అధికారులు ఇంటివద్దకు విచారణకు వస్తున్నారనే కరాటే కళ్యాణి.. బయటకు వెళ్లి పోయి ఉంటుందా.. అదే నిజం అయితే ఆమె ఎక్కడకు వెళ్లింది.. ఎప్పుడు వస్తుంది.. ఆమె దగ్గర ఉన్న చిన్నారలు వివరాలు ఏంటి.. వారిని ప్రభుత్వ అనుమతితోనే దత్తత తీసుకుందా లేదా అనే దాని గురించి ప్రస్తుతం జోరుగా చర్చించుకుంటున్నారు. కాగా, ఇటీవల శ్రీకాంత్ రెడ్డితో గొడవ జరిగినప్పుడు ఆమెతో పాటు ఆ చిన్నారి ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ చిన్నారుల విషయంపై కరాటే కళ్యాణి ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Srikanth Reddy: లైవ్ డిబేట్ లో నోరు పారేసుకున్న శ్రీకాంత్ రెడ్డి.. సినిమావాళ్లని బచ్చాగాళ్లు అంటూ!
సినీనటి కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య జరిగిన వ్యవహారం ఇప్పటికీ రచ్చ లేపుతూనే ఉంది. సోషల్ మీడియాలో ఈ గొడవ ఎంత పెద్ద రచ్చ అయిందో తెలిసిందే. ప్రాంక్ వీడియోల పేరుతో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసింది కరాటే కళ్యాణి. శ్రీకాంత్ కూడా ఆమెపై చేయి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య రాజుకున్న వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ వివాదం ముదిరి ఇరువురిపై కేసులు నమోదు అయ్యాయి. తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కంప్లైట్ చేస్తే ఇరువురిపై ఒకే రకమైన కేసులు పెట్టి శ్రీకాంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని ఎస్‌ఆర్ నగర్ సీఐ సైదులుపై కల్యాణి ఫైర్ అయింది. తర్వాత మీడియాతో మాట్లాడిన కల్యాణి సీఐపై తీవ్రంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే చిన్నారుల వ్యవహారంపై ఫిర్యాదు రావడం గమనార్హం. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Karate Kalyani: టీవీ లైవ్‌లో శ్రీకాంత్‌పై తిట్లతో విరుచుకుపడ్డ కరాటే కళ్యాణి