Cash Program: తెలుగు బుల్లి తెర ప్రోగ్రామ్స్‌లో ‘‘క్యాష్’’కు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు టాప్ యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఎప్పుడూ టాప్ రేటింగ్‌లోనే ఉంటుంది. ప్రేక్షకులకు నాన్‌స్టాప్ నవ్వుల్ని అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ప్రతీ ఎపిసోడ్లో ఎంట్రీ ఇచ్చే సెలెబ్రిటీలు చేసే అల్లరి.. షోను మరో లెవల్‌కు తీసుకెళ్తుంటుంది. వచ్చిన వాళ్లే మళ్లీ వచ్చినా.. వారు షోలో చేసే సందడిలో మాత్రం తేడాలుంటాయి. అందుకే, ఈ షో అంత పెద్ద హిట్ అయింది. తాజాగా, ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ఎపిసోడ్‌కు జబర్థస్త్ నటులు తమ భార్యలతో జంటగా వచ్చారు. ఆనంద్ – మంజుల, కొమరం – రజిత, శాంతికుమార్ – సుమ, సత్తిపండు – నాగమాంబలు షోలో సందడి చేశారు. భార్యభర్తల మధ్య చోటుచేసుకునే సంఘటనలతో పుట్టే హాస్యం పడీపడీ నవ్విస్తుంది.
భార్యలు.. భర్తల బుగ్గ కొరికే సన్నివేశాలు షోకే హైలెట్‌గా నిలిచాయి. ఇందులో.. సుమ సెలెబ్రెటీల భార్యలను ఓ క్వశ్చన్ అడుగుతుంది. దానికి వాళ్లు భర్తల బుగ్గల్ని కొరికి గాటు పడేలా చేస్తే.. సమాధానం చెప్పనక్కర్లేదు. లేదంటే సమాధానం చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆనంద్‌ను సుమ ఓ క్వశ్చన్ అడుగుతుంది. దానికి సమాధానంగా ఆనంద్ భార్య.. భర్త బుగ్గ కొరుకుతుంది. అయితే, భర్త బుగ్గపై గాట్లు పడకుండా ఉండాలని మెల్లగా కొరుకుతుంది. సుమ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పటానికే తన బుగ్గ మెల్లగా కొరికిందని ఆనంద్ అంటాడు. అయితే, సుమ అడిగిన ప్రశ్నకు ఆనంద్ భార్య ఏం సమాధానం చెప్పిందో తెలియాలంటే జూన్ 11వరకు వేచి చూడాల్సిందే. మరి, ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Breaking: ఇండస్ట్రీలో విషాదం! స్టార్ హీరో కన్నుమూత!