బ్రహ్మానందం.. తెలుగు చలన చిత్ర రంగంలో ఆయన ఓ హాస్య బ్రహ్మ. తన మాటలతో, చేతలతో, ఎక్స్ ప్రెషన్స్ తో కొన్ని దశాబ్దాల నుండి బ్రహ్మానందం ప్రేక్షకుల చేత ఆనందో బ్రహ్మ అనిపిస్తున్నారు. లెజండ్రీ యాక్టర్ అల్లు రామలింగయ్య తరువాత ప్రేక్షకులను ఆ రేంజ్ లో నవ్వించిన ఘనత బ్రహ్మానందం కే దక్కుతుంది. అయితే.. ఈ మధ్య కాలంలో బిగ్ స్క్రీన్ కి కాస్త దూరమైన బ్రహ్మానందం.. ఇప్పుడు సడెన్ గా బుల్లితెరపై మెరిశారు.
అలీ హోస్ట్ గా చేస్తున్న అలీతో సరదాగా షో కి బ్రహ్మీ గెస్ట్ గా విచ్చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ ప్రోమోకి మంచి రీచ్ లభించింది. దీంతో.. షో యాజమాన్యం ఇప్పుడు ఈ ఎపిసోడ్ కి సంబంధించి రెండో ప్రోమోని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. అయితే.. ఇందులో కూడా బ్రహ్మానందం చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. ఇలా సరదాగా సాగిపోతున్న వీరి సంభాషణ అలీ అడిగిన ఒక్క ప్రశ్నతో సీరియస్ అయిపోయింది.
సినిమాలలో ఈ మధ్య మీ హవా తగ్గిపోయింది. ఎందకు అంటూ.. బ్రహ్మానందంని అలీ ప్రశ్నించాడు. దీనికి బ్రహ్మి సీరియస్ అయ్యారు. ఎలాంటి సమాధానం చెప్పకుండా, స్పెట్స్ విసిరిగొట్టి షో నుండి మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. దీంతో.. ఆంతా షాక్ కి గురయ్యారు. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.