Boyapati Movie With Balayya: నందమూరి బాలక్రిష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా అంటే.. సూపర్ హిట్ అనే ముద్ర పడిపోయింది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి మూడు సినిమాలు చేశారు. సింహతో మొదలైన ఈ డెల్లీ కాంబో వయా లెజెండ్ మీదుగా అఖండ వరకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అఖండ సినిమా బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. బాలయ్య, బోయపాటి కాంబోలో నాలుగో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలో బోయపాటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆఖండ సినిమాకు సీక్వెల్ ఉండబోతున్నట్లు ప్రకటించారు. అఖండ-2 సినిమా కథ కూడా పూర్తయినట్లు కూడా తెలిపారు. అయితే, సీక్వెల్ స్టోరీ వద్దని, లెజెండ్ లాంటి పొలిటికల్ బ్రాక్ డ్రాప్ స్టోరీ కావాలని బాలయ్య అడిగారట. ఈ నేపథ్యంలో బోయపాటి పొలిటికల్ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
కాగా, బోయపాటి ఇదివరకే రామ్‌తో ఓ సినిమా కమిట్ అయ్యారు. త్వరలో ఆ సినిమా షూటింగ్లో పాల్గొంటారు. ఇక, బాలయ్య కూడా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో మరో చిత్రం చేయనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత బోయపాటి సినిమా షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. మరి, బాలయ్య, బోయపాటి డెడ్లీ కాంబో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : బాబాయ్‌తో మల్టీస్టారర్ సినిమా గురించి అబ్బాయ్ ఏమన్నాడంటే..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.