సెలబ్రిటీలు అనగానే తప్పకుండా తమ అభిమానులకు ఎంతో దగ్గరగా ఉంటారు. అలా ఉండే క్రమంలో కొన్ని సందర్భాల్లో ఫన్నీ ఘటనలు కూడా జరుగుతుంటాయి. కానీ, బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ కు మాత్రం అన్ని సందర్భాల్లో అలాగే జరుగుతుంటుంది. అతని ఫాలోయింగ్ అలాంటింది. ఇన్ స్టాగ్రామ్ లో 23.6 మిలియన్ ఫాలోఫర్స్ ఉంటే ఆ మాత్రం ఉంటుందిలెండి. గతంలో ఓ అభిమాని నా కామెంట్ కు రిప్లై ఇస్తే.. నీకు రూ.10 లక్షలు ఇస్తానంటూ మెసేజ్ చేసింది. అందుకు కార్తిక్ ఆర్యన్ రూ.10 లక్షలు పంపు అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.
ఇదీ చదవండి: యుద్దాన్ని తలపించిన బిగ్ బాస్ హౌస్! కొట్టుకునే వరకు!
అలాంటి ఘటనే మరొకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈసారి ఏకంగా పెళ్లి సంబంధమే వచ్చేసింది. ఓ అభమాని నన్ను పెళ్లాడితావా? రూ.20 కోట్లు కట్నంగా ఇస్తానంటూ కామెంట్ చేసింది. అందుకు కార్తిక్ ఆర్యన్ రిప్లై కూడా ఇచ్చాడు. ఎప్పుడు చేసుకుందాం పెళ్లి? అనగానే.. ఆమె ఇప్పుడే వచ్చెయ్ చేసేసుకుందాం అంది. ఆ కామెంట్స్ చూసిన మరికొంత మంది అమ్మాయిలు మేము కూడా డబ్బు ఇస్తాం మమ్మల్ని కూడా పెళ్లి చేసుకో అంటూ కామెంట్ చేశారు. వెంటనే కార్తిక్ ఆర్యన్ వేలంపాట పెడదామా అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు కార్తిక్ ఆర్యన్ కట్నం ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.