ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా అనే క్రేజ్ ఎప్పుడైతే మొదలైందో.. అప్పటినుండి ప్రతి హీరో ఆ స్థాయిలోనే సినిమాలు చేయాలని ఆరాటపడుతున్నారు. అప్పటివరకూ ఓ భాషలో నటించిన హీరోలు.. ఇప్పుడు ఎలాగో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది కదా.. మన సినిమాలు కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నారు. కానీ.. ఆ సినిమాలు, అందులోని కంటెంట్.. అన్ని ప్రాంతాల అభిరుచులకు తగ్గట్లుగా ఉందా లేదా? అనేది మాత్రం ఆలోచన చేయట్లేదు. సాధారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఆమిర్ ఖాన్ అని చెబుతుంటారు. అదీగాక బాలీవుడ్ లో కలెక్షన్స్ పరంగా ఆమిర్ సృష్టించిన రికార్డులు ఇప్పటికి అలాగే ఉన్నాయి. ఇప్పటివరకు బాలీవుడ్ లో తాను క్రియేట్ చేసిన రికార్డులను తానే (గజినీ, 3 ఇడియట్స్, పీకే, ధూమ్ 3, దంగల్) బీట్ చేసుకుంటూ వచ్చిన ఆమిర్.. తాజాగా లాల్ సింగ్ చడ్డా మూవీతో కనీసం డబ్బింగ్ సినిమాలో కూడా అందుకోలేకపోవడం గమనార్హం. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ప్లాప్ తర్వాత ఆమిర్ 'లాల్ సింగ్ చడ్డా' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ అందుకున్న ఈ సినిమా ఫస్ట్ కలెక్షన్స్ పరంగా తీవ్రస్థాయిలో విఫలమైంది. ఆమిర్ ఖాన్ సినిమాలంటే దేశవ్యాప్తంగా ఏ రేంజిలో ఆసక్తి ఏర్పడుతుందో అందరికి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు ఆమిర్ సినిమాకు మొదటిరోజు రూ. 12 కోట్ల గ్రాస్ మాత్రమే రావడం హాట్ టాపిక్ గా మారింది. అసలే కొన్నేళ్లుగా సరైన హిట్ లేక స్ట్రగుల్ అవుతున్న బాలీవుడ్ కి లాల్ సింగ్ రూపంలో ఆమిర్ బ్లాక్ బస్టర్ ఇస్తాడని ఎక్సపెక్ట్ చేశారు. కానీ.. తీరా రిలీజ్ అయ్యాక సినిమా బోల్తాకొట్టింది. అదేవిధంగా సినిమాకి ప్లాప్ టాక్, కలెక్షన్స్ 12 కోట్లు మాత్రమే రావడంతో.. సౌత్ నుండి డబ్బింగ్ రూపంలో బాలీవుడ్ లో విడుదలైన సినిమాల ఓపెనింగ్స్ కూడా దాటలేకపోయింది. 2022లో బాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలుగా విడుదలైన కేజీఎఫ్ 2(రూ. 53.95 కోట్లు), RRR (20.07 కోట్లు) బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టాయి. డబ్బింగ్ వెర్షన్ లో విడుదలైన కేజీఎఫ్ 2, RRR సినిమాలే హిందీలో ఫస్ట్ డే అన్ని కోట్లు కలెక్ట్ చేశాయి. మరి ఇప్పటివరకూ 2022లో విడుదలైన ఏ ఒక్క బాలీవుడ్ సినిమా ఆర్ఆర్ఆర్ 20 కోట్ల ఓపెనింగ్స్ ని దాటలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన బాలీవుడ్ సినిమాలలో భూల్ భులైయా 2(14 కోట్లు), బచ్చన్ పాండే(13.25 కోట్లు), లాల్ సింగ్ చడ్డా(12 కోట్లు), సామ్రాట్ పృథ్వీరాజ్(10.7 కోట్లు), గంగూబాయ్(10.50 కోట్లు) కలెక్షన్స్ లో టాప్ 5 గా నిలిచాయి. మరోవైపు డబ్బింగ్ మూవీస్ గా వచ్చిన RRR, KGF 2 సినిమాలు కేవలం హిందీలోనే రూ. 100 కోట్లకు పైగా వసూల్ చేశాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో బాలీవుడ్ సినిమాలు.. డబ్బింగ్ సినిమాల ఓపెనింగ్స్ ని కూడా ఎందుకు బీట్ చేయలేకపోతున్నాయని చర్చలు నడుస్తున్నాయి. ఎప్పుడైనా.. ఏ ఇండస్ట్రీ అయినా సినిమాలలో కంటెంట్ ఉంటేనే బాక్సాఫీస్ వద్ద నిలబడతాయి. పదేళ్ల ముందు బాలీవుడ్ లెవల్ వేరు.. ఇప్పుడున్న బాలీవుడ్ పరిస్థితి వేరు. ఇండియన్ సినిమాను సౌత్ సినిమాలే శాసిస్తున్నాయి అని చెప్పేందుకు 2022లో విడుదలైన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలే నిదర్శనం. మరి సౌత్ సినిమాలు డబ్బింగ్ రూపంలో విడుదలై బాలీవుడ్ లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ.. ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. హిందీ సినిమాలు బాలీవుడ్ లోనే నిలబడలేకపోతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. *Day 1* biz of the two event films, *dubbed in #Hindi*… 1. #KGF2: ₹ 53.95 cr 2. #RRR: ₹ 20.07 cr#Hindi version. Nett BOC. #India biz. — taran adarsh (@taran_adarsh) August 12, 2022