చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టులకు కొదవే లేదు. అదీగాక హీరో హీరోయిన్ల కంటే కూడా చైల్డ్ ఆర్టిస్టులకు త్వరగా గుర్తింపు లభిస్తుందని చెప్పవచ్చు. అయితే.. మొన్నామధ్య అఖండ సినిమాలో పాప, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ లో మల్లి పాత్ర పోషించిన పాప ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు బింబిసార సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవి.. సినిమా చూసిన వారందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవి గురించి ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు సినిమా లవర్స్. నందమూరి కళ్యాణ్ రామ్ మొదటిసారి భారీ బడ్జెట్ తో చేసిన సోషియో ఫాంటసీ మూవీ బింబిసార. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తానే స్వయంగా నిర్మించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయదుందుభి మోగిస్తోంది. క్రీస్తుపూర్వం త్రిగర్తల రాజ్యాన్ని పాలించిన బింబిసారుడి కథను ఆధారంగా చేసుకుని కల్పిత పాత్రలతో ఈ మూవీని తెరకెక్కించారు. డెబ్యూ డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో శాంభవి అనే కీలకపాత్రలో నటించి మెప్పించింది చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవి. సినిమాలోని ఫ్లాష్ బ్యాక్, ప్రెజెంట్ ఎపిసోడ్స్ లో ఈ చిన్నారి యాక్ట్ చేసింది. శ్రీదేవికి ఇదే మొదటి సినిమా కాదు. ఇంతకుముందు పలు సినిమాలలో మెరిసింది. రామారావు ఆన్ డ్యూటీ, మేజర్ వంటి సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్(ప్రేమ, యమలీల, కళ్యాణ వైభోగమే లాంటి)లోనూ నటిస్తోంది. ఇక శ్రీదేవి తన తండ్రి ద్వారా నటనలో అడుగుపెట్టింది. ఆ చిన్నారి తండ్రి శ్రీహరి గౌడ్ ఆర్టిస్టు మాత్రమే కాక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవ్వడం విశేషం. వీరి సొంతూరు బేతంచెర్ల కాగా.. ఇప్పుడు షూటింగ్స్ నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శ్రీదేవి నటనను అందరూ ప్రశంసిస్తున్నారు. ముద్దు ముద్దుగా క్యూట్ మాటలతో ఈ చిన్నారి తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39)