రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఆదివారంతో ముగిసింది. ఫినాలేలో హోస్ట్ నాగార్జున మాటలు గమనిస్తే.. బిగ్ బాస్ OTT వెర్షన్ రెండు నెలల్లో ప్రారంభమవుతుందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంటే.. బిగ్ బాస్ తెలుగు OTTలో కూడా అభిమానులను అలరించే అవకాశం ఉంది. హిందీలో కరణ్ జోహార్ హోస్ట్ గా ఇటీవల ప్రారంభించిన ‘Bigg Boss OTT’ నుండి ప్రేరణ పొంది.. బిగ్ బాస్ తెలుగు యాజమాన్యం కూడా బిగ్ బాస్ తెలుగు OTT పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది.
తాజా సమాచారం ప్రకారం, బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ తొలి సీజన్‌ను హోస్ట్ చేసేందుకు.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌ను బిగ్ బాస్ టీమ్ సంప్రదించినట్లు వినికిడి. ప్రస్తుతానికి ఈ OTT ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలేవి బయటికి రాలేదు. ఇటీవలే బిగ్ బాస్ తెలుగు 5 ప్రసారమయ్యే OTT ప్లాట్‌ఫారమ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు రాంచరణ్. అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్ తెలుగు 5’ సీజన్ ఫినాలే ఎపిసోడ్‌లో కూడా రాంచరణ్ దర్శనమిచ్చాడు.అలాగే తను మాట్లాడుతూ.. బిగ్ బాస్ ఇంటి సభ్యులు మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఎంకరేజ్ చేసాడు. ఈ ఫినాలే ఎపిసోడ్‌లో రాంచరణ్ ని బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించే టీజర్ కూడా రిలీజ్ చేసింది బిగ్ బాస్ మేనేజ్మెంట్. మొత్తానికి రాంచరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని బిగ్ బాస్ ప్రొడ్యూసర్స్ భారీ ప్రణాళిక వేశారు. ఇప్పటికే OTT ప్లాట్‌ఫారమ్‌లో కనిపించని ఎపిసోడ్‌లను ప్రసారం చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది బిగ్ బాస్ టీమ్.
ఇదిలా ఉండగా.. 24×7 ప్రసారమయ్యే OTT వెర్షన్‌లో ‘బిగ్ బాస్ తెలుగు’ నుండి ప్రత్యేకమైన కంటెంట్‌తో వెళ్లాలని ప్రొడక్షన్ టీమ్ నిర్ణయించుకుందట. ప్రస్తుతం ‘బిగ్ బాస్ తెలుగు OTT’కి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు, నటీనటుల ఎంపికలో బిజీ ఉందని.. త్వరలో బిగ్ బాస్ టీమ్ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మరి ‘బిగ్ బాస్ తెలుగు OTT’ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.