ప్రముఖ నటి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. కనిపించకుండా పోయిన నటి గోనె సంచిలో శవమై కనిపించింది. బంగ్లాదేశ్ కు చెందిన నటి రైమా ఇస్లాం షిము మృతదేహం ఓ వంతెన పక్కన లభ్యమైంది. భర్తపై అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 25 చిత్రాల్లో నటించిన రైమా.. బర్తమాన్ మూవీతో 1998లో ఆమె యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించింది.
రైమా ఇస్లాం షిము చిత్రాల్లోనే కాదు.. టీవీ సీరియళ్లోనూ నటించింది. కొన్ని సీరియల్స్ ను నిర్మించింది కూడా. కొద్దిరోజుల క్రితం నటి రైమా కనిపించకుండా పోయిందనే వార్త కలకలం రేపింది. ఆమె భర్త షెకావత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ బ్రిడ్జి పక్కన గోనె సంచిలో నటి రైమా ఇస్లాం షిము శవమై కనిపించింది. వంతనె పక్కన ఓ గోనె సంచిని గుర్తించిన పోలీసులు.. తెరిచి చూడగా అందులో రైమా శవం కనిపించింది. రైమా శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి. అనుమానంతో ఆమె భర్త షెకావత్ ను అదుపులోకి తీసుకున్నారు.
Body Bundled in a Sack.
Missing Actress of Bangladesh Raima Shimu’s body found in a sack, husband detained.#thesummernews #Missing #actress #Bangladesh #RaimaIslamShimu pic.twitter.com/kUErEWuNvu— The Summer News (@TheSummerNews) January 19, 2022
పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. హత్యలో అతని ప్రమేయం ఉన్నట్లు తేలింది. కుటుంబ కలహాలే నటి హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. రైమా భర్త, అతని మిత్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాల గురించి విచారణ ముమ్మరం చేశారు. కాగా, ఒక నటి ఇలా హత్యకు గురవ్వడం ఢాకాలో కలకలం రేపింది.