పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వచ్చిన భీమ్లా నాయక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1900 థియేటర్లలో రిలీజ్ చేయడం జరిగింది. భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదయ్యాయి. పాజిటివ్ టాక్ రావడంతో.. తొలి రోజే భీమ్లా నాయక్ సినిమా చూసేందుకు జనమంతా థియేటర్ల బాట పట్టారు. దీంతో కలెక్షన్స్ పరంగా తొలి రోజే ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది.
భీమ్లా నాయక్ రిలీజ్‌కి ముందు వచ్చిన అన్ని అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేయడంతో తొలి రోజే ఈ సినిమాకు పెద్ద రెస్పాన్స్ లభించింది. అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సత్తా చాటిన భీమ్లా నాయక్ ఒక్క నైజాం ఏరియాలో మాత్రం బాహుబలిని మించేసి వసూళ్లు రాబట్టాడు. నైజాం ఏరియాలో మెగా హీరోలకు మంచి మార్కెట్ ఉంటుందని తెలుసు. కానీ, భీమ్లా నాయక్ ఆ అంచనాలను మించి కలెక్షన్స్ రావడం విశేషం.తొలి రోజు ఒక్క నైజాం ఏరియాలోనే 11.81 కోట్ల రూపాయలు రాబట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాడు భీమ్లా నాయక్. దీంతో నైజాం ఏరియాలో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా భీమ్లా నాయక్ నిలిచింది. దీని తర్వాతి స్థానంలో 10.50 కోట్ల రూపాయలతో పుష్ప, 9.41 కోట్ల రూపాయలతో సాహో, ఆ తర్వాత 8.9 కోట్ల రూపాయలతో బాహుబలి-2 ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించారని, ఆయనతో పోటీపడి రానా నటించారనే టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ మరోసారి తన మాటలతో మాయ చేశాడు.
ఇకపోతే.. ఏపీలో ఆంక్షలు, వివాదాల మధ్య కూడా భారీగానే వసూళ్లు రాబట్టింది. ఏపీ , తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి 38 కోట్ల గ్రాస్ , 26. కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియాలో 3.10 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్ పరంగా చూస్తే 6.85 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇకపోతే అన్ని ప్రాంతాల్లో కలిపి తొలి రోజు భీమ్లా నాయక్ సినిమాకు 58.70 గ్రాస్, 38. 7 కోట్ల షేర్ రాబట్టింది.
<
Nizam : Day 1 Top 3 Box Office Collections
[Include GST]
1) #BheemlaNayak – 13.6 Cr
2) #PushpaTheRise – 11.44 Cr
3) #Saaho – 10.54 Cr[Exclude GST]
1) #BheemlaNayak – 11.81 Cr
2) #PushpaTheRise -10.50 Cr
3) #Saaho – 9.41 Cr @PawanKalyan @alluarjun #Prabhas— Nithin (@NithinPSPKCult) February 26, 2022
Nizam Day1
X Roads 39L (Top2)
Khammam 49L (ATR)
Karimnagar 31.5L (ATR)
Manguru 5.5L
Kodad 11.20L (ATR)
Huzurnagar 2.09l
MahaboobNagar 24L (ATR)
Nalgonda 16L (ATR)
AMB 17.7L (ATR)
Prasad's 28L ( ATR)
Nizambad 25.16L (ATR)#BheemlaNayak @PawanKalyan— Koti (@Otis_25) February 26, 2022