పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కిన భీమ్లా నాయక్ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద మాసివ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అగ్రదర్శకుడు త్రివిక్రమ్ మాటలు – స్క్రీన్ ప్లే అందించారు. సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమాలో.. పవన్ – రానాల యాక్షన్ తో పాటు ఫైట్ సీన్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి.
తాజాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ – రానా మధ్య జరిగిన ఫైట్ సన్నివేశాలలో ఓ టెక్నిక్ గురించి ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. ఫైట్ సీన్ లో పవన్.. రానా చేయి వెనక్కి మడిచి, తన కుడి కాలుతో మెడ పై తొక్కి పట్టే టెక్నిక్.. రామాయణంలో ప్రస్తావించినట్లు తెలుస్తుంది. రామాయణంలో హనుమంతుడు శత్రు సంహారం చేసే సమయంలో భీమావతారం ఎత్తి సంహరించిన తీరునే.. ఈ సినిమాలో ‘భీమ్లా పట్టు’గా పవన్ పాత్రకు డిజైన్ చేసినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి.ఈ సినిమాలో పవన్ పాత్ర ‘భీమ్లా పట్టు’ పట్టిన విధానం చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇలాంటి ఫైటింగ్ టెక్నిక్ ను మొదటిసారి చూపించడంతో అసలు ఈ ‘భీమ్లా పట్టు’ ఏంటి? ఎక్కడి నుండి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు? అనే విషయాలపై నెటిజన్లు పరిశోధన చేస్తున్నారు. ఇక భీమ్లా నాయక్ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. మరి భీమ్లా పట్టు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.