నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత ఆహా ఓటిటిలో టాక్ షో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ పేరుతో ఈ టాక్ షో ఆహలో మోస్ట్ పాపులర్ అయిపోయింది. బాలయ్య సినిమాల్లోనే కాదు.. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో కూడా తన మార్క్ చూపించగలడని ప్రూవ్ చేసేశాడు. అయితే.. ఇప్పటివరకు అన్స్టాపబుల్ టాక్ షోలో టాలీవుడ్ కి చెందిన చాలామంది సెలెబ్రిటీలు పాల్గొన్నారు.
తాజాగా బాలయ్యతో అన్స్టాపబుల్ ముచ్చట్లు చెప్పేందుకు లేటెస్ట్ ట్రెండింగ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ టీం పాల్గొన్నారు. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందనతో పాటు డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ షోలో హాజరయ్యాడు. అయితే.. ఈ షోలో పుష్పరాజ్ గా నటించిన అల్లు బన్నీ ఎంట్రీ టైంలో బాలయ్య స్పెషల్ ట్రీట్ ఇచ్చాడనే చెప్పాలి. బన్నీతో కలిసి ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అనే పవర్ ఫుల్ డైలాగ్ తొడకొట్టి మరీ చెప్పాడు బాలయ్య.
దీంతో ప్రేక్షకులు, పుష్ప టీమ్ సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా బాలయ్య డైలాగ్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మీరు కూడా వీడియో పై ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.