తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ యన్టీఆర్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండితెరపై బాలయ్య యాక్షన్, డైలాగ్స్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇటీవల రిలీజ్ అయిన అఖండ బాక్సాఫీస్ షేక్ చేసిన విషయం తెలిసిందే. నేటితరం హీరోలకు పోటీనిస్తూ.. వరుస సినిమాలు చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. నందమూరి బాలయ్యకు ‘సినారే జీవన సాఫల్య జాతీయ స్వర్ణఖంకన పురస్కారం’ ఇవ్వబోతున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో ఫ్యాన్స్ తెగ ఆనందంలో మునిగిపోయారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సాంగ్స్ అందించిన కవి సి నారాయణరెడ్డి 91వ జయంతి ఉత్సవాల సందర్భంగా జూలై 30వ తేదీన రవీంద్ర భారతిలో బాలకృష్ణకు ఈ పురస్కారం అందజేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ణ్ర మాజీ గవర్నర్ జీహెచ్ విద్యాసాగర్ రావు హాజరు కాబోతున్నారు. తమ అభిమాన నటుడికి అరుదైన గౌరవం దక్కడంతో అభిమానులు ఆనందోత్సాహాల్లో తెలుతున్నారు... హార్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు వద్ద కొన్ని ముఖ్యమైన సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు బాలయ్య. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది చదవండి: అప్పటి వరకు ఆగడం నా వల్ల కాదు! హీరోయిన్‌పై ప్రభాస్ పోస్ట్ వైరల్!