తెలుగు బుల్లితెరపై నవ్వుల పువ్వులు పూయిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయిన కామెడీ షో జబర్ధస్త్. జబర్ధస్త్ షోకి మొదటి నుంచి మెగా బ్రదర్ నాగబాబు, రోజా జడ్జీలుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇటీవల నాగబాబు జబర్ధస్త్ నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో కొంత మంది నటీనటులు వచ్చినా.. ప్రస్తుతం మాత్రం సింగర్, నటుడు నాగబాబు జడ్జీగా కొనసాగుతున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ ఇప్పుడు బుల్లితెరపై కూడా సందడికి సిద్ధం అంటున్నాడు. ఇప్పటికే ఆయన వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీలో ‘అన్‌స్టాపబుల్’ అనే కార్యక్రమం కన్‌ఫాం అయింది. నవంబరు 4వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుంది.
తాజాగా జబర్దస్త్ కామెడీ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదల చేయగా.. ఇందులో రోజా-బాలకృష్ణలు ఫోన్‌లో మాట్లాడుకుని సందడి చేశారు. జబర్దస్త్ యాంకర్ అనసూయ.. రోజాని మా అందరి సమక్షంలో బాలకృష్ణకు ఫోన్ చేయాల్సిందిగా కోరింది. దీంతో రోజా.. ఆయన మంచి మూడ్‌లో ఉంటే ఓకే లేదంటే.. అని నవ్వేస్తూ బాలయ్యకి ఫోన్ కలిపింది. ఫోన్ లిఫ్ట్ చేసిన బాలకృష్ణ హా రోజా గారు నమస్కారం అంటూ తన సంస్కారాన్ని చూపించారు. ‘బాగున్నారా?’.. అని రోజా అడగ్గా.. బాగున్నానమ్మా.. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను.. నేను జబర్దస్త్ లో ఉన్నానని రోజా చెప్పడంతో పాటు మీరేం చేస్తున్నారని బాలయ్యను అడగగా అఖండ షూటింగ్ జరుగుతోందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. మళ్లీ మనిద్దరం కలిసి ఎప్పుడు యాక్ట్ చేద్దామని రోజా అడిగింది.
భైరవద్వీపం పార్ట్ 2 చేస్తారా లేక బొబ్బిలి సింహం పార్ట్ 2 చేస్తారా అని అడుగుతున్నారని రోజా చెప్పగా.. రోజా అలా చెప్పగానే బాలకృష్ణ నవ్వి తప్పుకుండా చేద్దాం అందరూ ఎదురుచూస్తున్నారు.. మన కాంబినేషన్ కోసం.. కలిసి సినిమా చేయడమే కాదు.. జబర్దస్త్ షోకి జడ్జీగా కూడా వస్తాను అనడంతో అక్కడ ఉన్నవారంతో సంతోషం వ్యక్తం చేయడమే కాదు.. ఆశ్చర్యపోయారు. రోజా థాంక్యూ సో మచ్ సార్ అని అనేసింది. అనంతరం బాలయ్య.. ఆది, రాఘవ వీళ్లంతా ఎలా ఉన్నారు అని కూడా అడిగారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.