రోజా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి.. ఎమ్మెల్యేగా.. ఆ తర్వాత మినిస్టర్‌గా ఎదిగారు. ఆమె హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఇండస్ట్రీలోని టాప్ హీరోలు అందరితో నటించారు. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా వారందరితో రోజాకు ఇప్పటికి మంచి సంబంధాలే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున.. ఇలా అప్పటి హీరోలందరితో రోజాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రోజా.. కుటుంబంతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లింది. చిరు ఫ్యామిలీతో కలిసి సందడి చేసింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: చంద్రబాబు, లోకేష్ లు చీరలు కట్టుకోవాలి! : మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
ఏపీ మంత్రి హోదాలో రోజా హైదరాబాద్‌కు వచ్చింది. సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రోజా.. అనంతరం మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. రోజా ఫ్యామిలీ మొత్తం కలిసి చిరు ఇంట్లో సందడి చేశారు. చిరంజీవి, సురేఖలతో కలిసి రోజా ఫ్యామిలీ సభ్యులందరూ సరదాగా మాట్లాడుకున్నారు. మంత్రి పదవి చేపట్టిన రోజాను అభినందించి, సత్కరించారు చిరంజీవి. అనంతరం చిరంజీవి, సురేఖ, రోజా, రోజా ఫ్యామిలీ కలిసి సరదగా గడిపారు.
ఇది కూడా చదవండి: మంత్రి రోజాకు సన్మాన సభ.. హాజరుకానున్న సినీ ప్రముఖులు!వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో మెగాస్టార్ అయితే రోజా ఫ్యామిలీని ప్రేమగా ఆహ్వానించారు. రోజా పిల్లలను నవ్వుతూ పలకరించారు. రోజా కూతురు అన్షు తలని ప్రేమగా నిమిరారు. ఇక అందరూ కలిసి సరదాగా కాసేపు అలా సమయాన్ని గడిపారు. ఇక మినిస్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత షూటింగ్‌లకు దూరంగా ఉంటానని రోజా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమెకు ఎంతో పేరు, క్రేజ్ తీసుకొచ్చిన జబర్దస్త్ షోని కూడా వీడుతున్నట్టుగా రోజా ప్రకటించింది. మని దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
కుటుంబ సమేతంగా చిరంజీవిగారిని కలవడం చాలా సంతోషాన్నిచ్చింది. సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. Thank You @KChiruTweets pic.twitter.com/DWGpOPIPmn
— Roja Selvamani (@RojaSelvamaniRK) April 29, 2022
ఇది కూడా చదవండి: వీడియో: ‘సుమ షో’లో రోజా సందడి..! స్కిట్ అంతా అలాంటి మాటలే!