విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో.. అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం F3 పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. చిత్ర బృందం మొత్తం సక్సెస్ మీట్లతో ఫుల్ బిజీ అయిపోయారు. F2 కంటే మూడురెట్టు ఎక్కువగా నవ్విస్తామంటూ మాటిచ్చిన అనీల్ రావిపూడి, దిల్ రాజు మాట నిలబెట్టుకున్నారంటూ ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. సినిమా ఆడకపోతే నా ముఖం చూపించను అన్న నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ సక్సెస్ మీట్లలో హుషారుగా పాల్గొంటున్నారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉన్నా సినిమాకి సంబంధించి తమన్నాకీ- అనీల్ రావిపూడికి మధ్య గొడవలు జరిగాయంటూ వార్తలు మాత్రం జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ లో తమన్నా కనిపించకపోవడం. సినిమా విడుదలయ్యి.. బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత కూడా తమన్నా సక్సెస్ మీట్లకు గైర్హాజరు కావడంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అనీల్ రావిపూడితో గొడవ కావడం వల్లే ఆమె సినిమా ఈవెంట్లకు దూరంగా ఉంటోందంటూ కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఆ వ్యాఖ్యలపై డైరెక్టర్ అనీల్ రావిపూడి స్పందించాడు.
F3 షూటింగ్ సమయంలో తమన్నాతో గొడవ జరిగిన మాట వాస్తవమే అని చెప్పాడు. ‘F3 సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. వారందరినీ సెట్ లో మేనేజ్ చేయడం చాలా కష్టతరమైన విషయం. కొన్నిసార్లు షూటింగ్ సమయం పెరిగే అవకాశం ఉంటుంది. ఓసారి రాత్రి పూట షూటింగ్ ఇంకాస్త పొడిగించాల్సి వచ్చింది. నేను ఉదయమే జిమ్ చేసుకోవాలి.. నేను వెళ్లాలి అని చెప్పేసరికి నాకు కోపం వచ్చింది.’
‘ఆ హీట్ మా మధ్య ఓ రెండ్రోజులు కొనసాగింది. ఆ తర్వాత మాట్లాడుకున్నాం అంతా సద్దుమణిగింది. ప్రమోషన్స్ విషయానికి వస్తే తమన్నాకు వేరే సినిమా షూటింగ్స్ ఉండటంతో రాలేకపోయింది’ అంటూ అనీల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. అనీల్ రావిపూడి- తమన్నా మధ్య గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.