బుల్లితెరపై తన క్యూట్ అల్లరితో తక్కువ టైమ్‌లోనే మంచి గుర్తింపు సాధించింది యాంకర్ వర్షిణి. ప్రస్తుతం చేతులో అవకాశాలు లేవు. ఉన్న ఒక్క ‘కామెడీ స్టార్స్’ షో కూడా చేయట్లేదు. ఆ షో నుంచి వర్షిణినే వచ్చేసినట్లు టాక్ నడుస్తోంది. సినిమాల్లో అవకాశాలతోనే మానేసిందని కొందరంటే… బిగ్‌బాస్‌లో ఆఫర్ రావడంతోనే మానేసినట్లు కొందరు చెబుతున్నారు.
శాకుంతలం, మళ్లీ మొదలైంది సినిమాలతో వర్షిణి బిజీగా గడుపుతోంది. టీవీ షోలలో కనిపించకపోయినా… ఇన్‌స్టాలో మాత్రం రచ్చరచ్చ చేస్తోంది. ఎప్పుడూ ఏదొక అప్డేట్తో అభిమానులకు టచ్‌లో ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా వర్షిణి నెటిజన్లకు ఓ చిక్కుప్రశ్న విసిరింది. ఈ సమాజం నన్ను అంగీకరిస్తుందా అంటూ. వరలక్ష్మీ వ్రతం రోజు నేను పూజ చేయలేదు, ఆ ఫొటోలు నేను ఇనస్టాలో పెట్టలేదు. నన్ను ఈ సమాజం అంగీకరిస్తుందా?’ అంటూ మోవబ్రో హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టా స్టోరీ పెట్టింది.
వర్షిణి స్టోరీ కాస్తా బాగానే వైరల్ అయ్యింది. ఇటీవల డే ఆఫ్ డ్యాన్స్‌ని కూడా అభిమానునులు సెటైరిక్ పంచ్‌లతో బాగానే హైలెట్ చేశారు. నైస్ డ్యాన్స్ అంటూ కొందరు కితాబిస్తే, మరికొదరు ఫాలోవర్స్ నీకు పొట్ట వచ్చేస్తోంది.. తగ్గించవచ్చు కదా అంటూ కామెంట్ చేశారు.